వివో నుంచి వై31ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌

vivo-Y31
హైదరాబాద్‌ : ప్రీమియం గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ వివో తన అప్‌గ్రేడెడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వై31 ఎల్‌ను భారత్‌లో విడుదల చేసింది. నలుపు తెలుపు రంగుల్లో లభిస్తున్న ఈ ఫోన్‌ ధర 9450 రూపాయలే. 4.7 అంగుళాల డిస్‌ప్లే, 4జిఎల్‌టిఇ నెట్‌ వర్క్‌, స్నాప్‌డ్రాగన్‌ 410 క్వాడ్‌కోర్‌, వన్‌జిబిరామ్‌, 16జిబిరామ్‌, 128 జిబివరకూ విస్తరించే అవకాశం. 8 ఎంపి వెనుక కెమేరా, 5ఎంపి ముందు కెమేరాలున్నాయి. 2200ఎంఎహెచ్‌ బ్యాటరీ శక్తివంతంగా పనిచేస్తోంది. వివో ఇండియా సిఇఒ అలెక్స్‌ఫెంగ్‌ వైఎల్‌31 ఎల్‌ను విడుదల చేయడంతో భారత్‌లో మంచి మార్కెట్‌ వాటా సాధించగలమని వెల్లడించారు. ఆండ్రాయిడ్‌ 5.1 లాలిపాప్‌ ఆధారితఫన్‌టచ్‌ ఒఎస్‌ 2.1పై పనిచేస్తోంది. వన్‌జిబి రామ్‌, 16జిబి రామ్‌ అనుసంధానం చేసింది. ఈడార్క్‌ స్క్రీన్‌పై సులభంగా ఎఫ్‌అని స్వైప్‌చేస్తే ఫేస్‌బుక్‌కు తీసుకువెళుతుంది. ఎంఅని బ్రౌజ్‌ చేస్తే ప్లేమ్యూజిక్‌కు తీసుకెళుతుంది. ప్రస్తుతం 200కుపైగా నగరాల్లో వివో ఫోన్లు తమ ఉనికిని పెంచుకుంటున్నాయి. ప్రపంచం లోని అత్యుత్తమ పది స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లలో ఒకటిగా వివో గుర్తింపు తెచ్చుకుందని సిఇఒ వెల్లడించారు.