విమానరంగంపై జిఎస్‌టి 12% లోపే ఉండాలి

Ashok Gajapatiraju
Ashok Gajapatiraju

విమాన రంగంపై జిఎస్‌టి 12% లోపే ఉండాలి

న్యూఢిల్లీ,: దేశంలో పౌరవిమాన యాన రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు వీలుగా టికెట్లపై జిఎస్‌టి అమలయితే 12శాతం కంటే తక్కు పన్నురేటును మాత్రమే అమలుచేయాలని కోరుతూ ఆ శాఖమంత్రి అశోక్‌గజపతిరాజు ఆర్థికశాఖకు ప్రతిపాదన లు పంపించారు. అలాగే జిఎస్‌టిపరిధిలోకే యేవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ను తీసుకురావాలని కోరారు. అలా చేయకపోతే జిఎస్‌టి అమలువల్ల రేట్లు మరింతగాపెరుగుతాయని వెల్లడించారు. అయితే ఆర్ధ్థిక మంత్రి మాత్రం ఎటిఎఫ్‌ డిమాండ్‌ను అంగీకరించకపోవచ్చని, ఇప్పటికే పెట్రోలియం జిఎస్‌టిపరిధిలోలేదని అందు వల్ల ఎటిఎఫ్‌పై పన్ను విధించే సమస్య ఉత్పన్నం కాబోదని చెపుతున్నారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాలు ఎటిఎఫ్‌పై పన్నులు విధిస్తున్నాయి. ఎక్సైజ్‌డ్యూటీ, వ్యాట్‌లు వీటిలోకీలకం. సేవాపన్ను ఆరుశాతంగా ఉంది. ఎకానమి ఎయిర్‌ట్రావెల్‌కు ఆరు, తొమ్మిదిశాతం ప్రీమియం తరగతులకు వసూలుచేస్తున్నారు. ప్రస్తుతం జిఎస్‌టి విధానం అమలయితే వివిధ రాష్ట్రాలు, దేశాలమధ్య జరిగే ప్రయాణాలపై పునఃసమీక్ష చేయాల్సి ఉంటుంది. వివిధ రాష్ట్రాలు, దేశాలమధ్య జరిగే ప్రయాణాలను వేరువేరుగా పరిగణించాలా అన్నదే ప్రస్తుతం సమస్యగా ఉంది. జిఎస్‌టి అమలు ఎక్కడ విమానం ఎక్కుతారో ఆ కేంద్రంగా మాత్రమే అమలవుతుంది. ఈ విధానం ప్రస్తుత జిఎస్‌టి అమ లుకు భిన్నంగా ఉంది. అలాగే తిరుగుప్రయాణం కూడా ఒక ప్రత్యేక ప్రయాణంగా పరిగణిస్తారు. ఎక్కడ ఆగినా బయలుదేరే కేంద్రం మాత్రమే పరిగణనలోనికి వస్తుంది. భారత్‌ బయట తిరుగుప్రయాణం ప్రారంభం కేంద్రం ఉంటే సేవాపన్ను వర్తించ దని నిపుణులు చెపుతున్నారు. జిఎస్‌టి మండలి కూడా పరోక్ష పన్నులపరంగా 18శాతం పన్నురేటు అమలుచేయాలని సూచించింది. కొన్ని అత్యవసర సర్వీసులు మాత్రం ఆరునుంచి 12శాతం మధ్యలో ఉండాలని నిర్ణయించింది. అయితే పూర్తిస్థాయి నిర్మాణక్రమం ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇదే విధానం అమలయితే టికెట్ల ఖర్చుపెరుగుతుంది. జిఎస్‌టి బయట ఎటిఎఫ్‌ ఉంటున్నందున ఇన్‌పుట్‌క్రెడిట్‌ అనేదిఉండదు. ఎయిర్‌క్రాప్ట్‌లీజులు, విడిభాగాలు, యంత్రపరికరాలపై కూడా ధరలు పెరుగు తాయి. అలాగే నగదు అవసరాలు కూడా ఆయా సంస్థలకు పెరుగుతాయి. విమానయాన సంస్థలకు ఎప్పుడో తర్వాత ఇన్‌పుట్‌ ట్యాక్స్‌క్రెడిట్‌లు వచ్చినా ఇప్పటికిప్పుడు భరించాల్సి వస్తుందని ఆసియాపసిఫిక్‌ ఏవియేషన్‌ కేంద్రం (కాపా) తన 2017-18ఇండియా ఏవియేషన్‌ ముఖచిత్రంలో వివరించింది. మొత్తంమీద జిఎస్‌టిని 12శాతం కంటే తక్కువగా మాత్రమే అమలుచేయాలని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు ఆర్థికమంత్రికి ప్రతిపాదించడం ఈ రంగంలో ఎకానమి తరగతి ప్రయాణాలను మరింత ప్రోత్సహించినట్లవుతుంది.