విదేశీ ఇన్వెస్టర్ల మోజు

Dollars
Dollars

విదేశీ ఇన్వెస్టర్ల మోజు

ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్లకు రోజురోజుకూ ఆసక్తి పెరుగుతు న్నట్లు కుమ్మరిస్తున్న పెట్టుబడులే స్పష్టంచేస్తున్నా యి. ఈనెలలో తొలి వారం నాలుగు ట్రేడింగ్‌లలోనే విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు సుమారు 2.45 బిలియన్‌ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 16 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు కుమ్మరిం చారు. వీటిలో రూ.5000 కోట్లు ఈక్విటీల్లోను, రూ.11,000కోట్లు రుణసెక్యూరిటీల్లోను పెట్టుబడు లు పెట్టారు. రాజ్యసభలో కూడా మెజార్టీ సాధించే దిశగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం, జిఎస్‌టి అమలుకు వీలుగా నాలుగు బిల్లులను పార్లమెంటు ఆమోదించడం, ఆర్ధికవ్యవస్థ పురోభివృద్ధిపై సానుకూల అంచనాలు వంటివి విద ేశీ ఇన్వెస్టర్లకు మంచి ధీమా కల్పిస్తున్నట్లు అంచ నా. గతనెలలో దేశీయ మూలధన మార్కెట్లలో ఎఫ్‌పిఐలు భారీస్థాయిలోనే పెట్టుబడులు పెట్టారు. మార్చి నెలలో మొత్తం రూ.57వేల కోట్లు అంటే 8.7బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టారు.

నల్ల ధనానికి చెక్‌పెడుతూ పోద్దనోట్ల రద్దును ప్రకటిం చిన కేంద్రం ప్రభుత్వం జిఎసప్‌టి వంటి ఆర్ధిక సంస్కరణలకు తెరతీస్తున్నదన్న అంచనాలు ఇన్వె స్టర్లకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. గత ఏడాది అక్టోబరు నుంచి ఎఫ్‌పిఐలు ఉన్నట్లుండి అమ్మకాల వైపు మళ్లారు. అమెరికా ఫెడ్‌ రిజర్వు వడ్డీపెంపు అంచనాలు, అధ్యక్ష ఎన్నికల్లోట్రంప్‌ విజయం దేశీ యంగా పెద్ద నోట్లరద్దు వంటి అంశాల నేపథ్యంలో 2016 అక్టోబరు మొదలు 2017 జనవరి వరకూ ఎఫ్‌పిఐలు మొత్తంగా రూ.80,000 కోట్లుకు పైబడి దేశీయ మార్కెట్ల నుంచి ఉపసంహరిం చుకున్నారు. ఈ పరిణామాల తర్వాత తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి మాసంనుంచి దేశీయస్టాక్స్‌పై విదేశీ ఇన్వెస్టర్లకు గురిపెరిగింది. దేశీయ మార్కెట్ల లో సెన్సెక్స్‌ ప్రామాణికసూచి 30వేల పాయింట్ల కు చేరువకాగా ఎన్‌ఎస్‌ఇ నిప్టీ కూడా తన రికార్డుస్థాయి 9900 మార్కును చేరింది. దీనివల్ల ఇన్వెస్టర్లకు మంచి ఊతం ఇచ్చినట్లు కనిపించింది.