వచ్చే మూడేళ్లలో 300 అపోలో షుగర్‌ క్లినిక్‌లు

APOLLO
సంస్థ సిఇఒ గగన్‌ భల్లా

వచ్చే మూడేళ్లలో 300 అపోలో షుగర్‌ క్లినిక్‌లు

సంస్థ సిఇఒ గగన్‌ భల్లా

హైదరాబాద్‌,జనవరి 24: మధుమేహం స్క్రీనింగ్‌ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్వాగతిం చదగినవేనని అపోలోషుగర్‌ వెల్లడించింది. దేశవ్యాప్తం గా అపోలోషుగర్‌ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా వచ్చే మూడేళ్లలో 300క్లినిక్స్‌ దేశవ్యాప్తంగా ఏర్పాటుచేస్తా మని సిఇఒ గగన్‌భల్లా వివరించారు. ప్రస్తుతం అపోలో షుగర్‌కు 52 క్లినిక్స్‌ ఉన్నాయని, వీటిలో పది క్లినిక్స్‌ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు వివరించారు. విజయవాడ లో ఆంధ్రహాస్పిటల్స్‌ భాగస్వామ్యంతో అపోలోషుగర్‌ పనిచేస్తుందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అత్య ధిక వేగంతో విస్తరిస్తున్న మధుమేహరోగులకుమరింత ఉన్నతసేవలందించగలమని ఆయన వెల్లడించారు మొత్తం వందకుపైగా డయాలెక్టోలాజిస్టులు, ఎండో క్రినాలజిస్ట్‌లతోపాటు 150కిపైగా డైటీషియన్‌లతో భారీ నెట్‌వర్క్‌ ఏర్పాటుచేసామని, రెండులక్షలమందికిపైగా మధుమేహరోగులకు సేవలందించగలిగామని గగన్‌ భల్లా వివరించారు. 300కొత్త క్లినిక్స్‌లో 1500 నుంచి 2500 మందివరకూ ఎంబిబిఎస్‌, ఎండిజనరల్‌ ప్రాక్టీ షనర్లతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. రెండో తరం నగరాలు, గ్రామీణప్రాంతాలకు సైతం విస్తరి స్తామన్నారు. దేశసగటుతో పోలిస్తే ఎపి,తెలంగాణల్లోనే ఎక్కువగా షుగర్‌కేసులు నమోదవుతున్నాయని, జాతీయ సగటు 18శాతం అయితే ఈరెండు రాష్ట్రాల్లో 25శాతం ఉందని అపోలో షుగర్‌ సిఇఒ వెల్లడించారు.