లెనోవోనుంచి భావితరం ల్యాప్‌టాప్‌లు

Lenovo
Lenovo

హైదరాబాద్‌: భావితరం ఫీచర్లతో ఫ్యూచర్‌రెడీ ల్యాప్‌టాప్‌లనుప్రముఖ లాప్‌టాప్‌కంపెనీ లెనోవో ఆవిష్కరించింది.
ప్రీమియంకేర్‌ సపోర్టును కూడా అందిస్తూ ప్రీమియం నోట్‌బుక్స్‌ నిరంతర సేవలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది.
ప్రీమియంకన్వర్టబుల్స్‌యోగా 720, యోగా 520, అల్ట్రాధిన్‌, లైట్‌పవర్‌ హౌసెస్‌, ఐడియాపాడ్‌ 520ఎఫ్‌, 320ఎస్‌,
పూర్తి మల్టీమీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ ల్యాప్‌టాప్‌లు ఐడియాపాడ్‌520,320లు కూడా అందుబాటులోనికి వచ్చాయని
కంపెనీ వివరించింది. ఇంటెల్‌ 7జి ప్రాసెసర్లు ఏర్పాటుచేసామని, నివిడియాగ్రాఫిక్స్‌, ఫుల్‌ హెచ్‌డిఐపిఎస్‌ డిస్‌ప్లే,
నారోబీజిల్స్‌, ఇంటిగ్రేటెడ్‌ డాల్బీ ఆడియోప్రీమియం అట్మాస్‌టెక్నాలజీ వంటివి ఉన్నాయి. హర్మాన్‌ స్పీకర్లు ప్రత్యేక
ఆకర్షణగా ఉన్నాయి. వేలిముద్రల రీడింగ్‌, విండోస్‌ 10 హోమ్‌పర్సనల్‌ అసిస్టెన్స్‌ కోర్టానా కూడా ఉంది. దక్షిణభారత్‌
మేనేజర్‌ అంజన్‌ బార్హు మాట్లాడుతూ అత్యంత నాజూకైన ఉత్పత్తులను కస్టమర్లకు అందిస్తున్నామన్నారు. యోగా 720
రూ.74,500లు, నుంచి యోగా వై720 1.49,800రూపాయలవరకూ వివిధ కేటగిరీలధరలున్నట్లు ఆయన తెలిపారు.