లిబర్టీ షూస్‌ లాభాల రెట్టింపు

Liberty
Liberty

న్యూఢిల్లీ: లిబర్టీ షూస్‌ షేర్‌ ధర శనివారం భారీ లాభాలను సాధించింది.ఒకదశలో 5.3శాతం లాభంతో రూ.217కు ఈ షేరు విలువ చేరుకుంది. జూన్‌ త్రైమాసికంలో కంపెనీ లాభాలు రెట్టింపు అవడమే ఇందుకు కారణం. తొలి త్రైమాసిక ఫలితాల్లో లిబర్టీ షూస్‌ ఆదాయం 19.9శాతం పెరిగి రూ.146.2శాతానికి చేరింది. కంపెనీ నికరలాభం రూ.1.1కోట్ల నుంచి రూ.2.3కోట్లకు చేరింది. ఎబిటా 17శాతం వృద్ధితో రూ.10.3కోట్ల వద్ద ముగిసింది. 7.2శాతం నుంచి 7శాతానికి మార్జిన్లు తగ్గాయి.