లాభాల‌తో ప్రారంభ‌మైన దేశీయ మార్కెట్లు

stocks
stocks

ముంబైః భారీ నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు గురువారం కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో మార్కెట్‌ ఆరంభం నుంచే సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభంతో ఉండగా.. నిఫ్టీ కూడా 10,450 మార్క్‌ పైన ట్రేడ్‌ అవుతోంది. ఉదయం 9.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 125 పాయింట్ల లాభంతో 34,470 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 10,455 వద్ద కొనసాగుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ఉండగా.. టాటామోటార్స్‌, వేదాంత షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.