లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

BSE111
BSE

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబై, మార్చి 1: దేశ స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు అంచనాలకు మించి వెలువడటంతో స్టాక్‌ మార్కెట్లు నష్టాలనుంచి రికవరీ అయ్యాయి. డిసెంబరుత్రైమాసికంలో జిడిపి గణాంకాలు ప్రభుత్వం వెల్లడించడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. సెన్సెక్స్‌ 203 పాయింట్లుపెరిగి 28,946 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 61 పాయింట్లుపెరిగి 8940 పాయింట్లవద్దకు చేరింది. మార్కెట్లలో స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు వరుసగా 0.1శాతం, 0.4శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్‌లో 1629 కంపెనీలు లాభాల్లో ముగిస్తే 1216 కంపెనీలు నష్టాలు చవిచూసాయి. 197 కంపెనీలషేర్లు స్థిరంగా నిలిచాయి. రియాల్టీ సూచీ 3.5శాతంపెరిగింది. శోభా 16శాతం, యునిటెక్‌ 7శాతం, ఓబరా§్‌ు రియాల్టీ ఐదుశాతం, పెరిగాయి. రియాల్టీసూచీ 10శాతం వరకూ బడ్జెట్‌ అనంతరం పెరిగినట్లు అంచనా. మొత్తం బెంచ్‌మార్క్‌ సూచీలు నాలుగుశాతంపెరిగితే రియాల్టీ ఒక్కటే పదిశాతంవరకూ పెరిగింది. వ్యక్తిగత స్టాక్స్‌లో టాటా టెలీ 20శాతంపెరిగింది. 9.62రూపాయలవద్ద ముగిసింది. టాటాసన్స్‌,ఎన్‌టిటిడొకొమో పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రకటించడమే ఇందుకుకీలకం. మెజెస్కో 13శాతంపెరిగి 389 రూపాయలకు చేరింది.

ఐటి కన్సల్టింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ తన బీమా సంస్థతోపాటు మరో అనుబంధ సంస్థ రెండు కొత్త ఉత్పత్తులు విడుదలచేసింది. టాటాస్పాంజ్‌ ఐరన్‌ 9శాతంపెరిగి 710కి చేరింది. సంస్థాగత ఇన్వెస్టర్లు సంస్థలో ఒకటిశాతం వాటాను కొనుగోలుచేసాయి. క్షీణించిన జాబితాలో మోయిల్‌ 3శాతం దిగజా రింది. 342రూపాయలకు చేరింది. ఇక యూరో పియన్‌ మార్కెట్లు గరిష్టంగాపెరిగాయి. యూరోపి యన్‌ స్టాక్స్‌ 600 సూచీ 0.7శాతం పెరిగింది. ఫ్రాన్స్‌ సిఎసి40, జర్మనీ డాక్స్‌ 1శాతంచొప్పున పెరి గింది. ఆసియా మార్కెట్లు అమెరికా అధ్యక్షుని ఇన్‌ఫ్రా వ్యయం, పన్ను సంస్కరణలపై మరింతగా స్పందించక పోయినా మార్కెట్లు గరిష్టంగానే పెరి గాయి. ఆసియా పసిఫిక్‌షేర్లు జపాన్‌ బైటి ప్రాం తంలో 0.2శాతం దిగజా రాయి.

జపాన్‌నిక్కీ మాత్రం 1.4శాతం పెరిగింది. చైనా షాంఘై కాంపోజిట్‌, హాంకాంగ్‌హ్యాంగ్‌ షంగ్‌ సూచీలు 0.16శాతం, 0.15శాతం చొప్పున పెరిగాయి. ఇక మూడోత్రైమాసిక జిడిపి గణాంకాలు ఆశాజనకంగా మారాయి. పెద్దనోట్ల రద్దు పెద్దగా ప్రభావం లేదని కేంద్రం ప్రకటించింది. మిగిలిన త్రైమాసికంలో కూడా భారీగా వృద్ధి ఉంటుందని ధీమా వ్యక్తంచేసింది. ఇక ప్రైవేటుగా అంటే ప్రజల్లో వినిమయ వ్యయశక్తి రెండురెట్లు పెరిగి పదిశాతానికి చేరింది. అంతకుముందు రెండోత్రైమాసికంలో ఐదుశాతం మాత్రమే నిలిచింది. ఇక తయారీరంగంలో కూడా వృద్ధిక్రమేపీ పెరుగుతున్నది. నిక్కీఇండియా పిఎంఐ సూచీ 50.7 పాయింట్లుగా ఫిబ్రవరిలో ఉందని వెల్లడించడం మార్కెట్లకు సానుకూలం అయింది.