లాభాల్తో ముగిసిన మార్కెట్లు

stock
stock

ముంబైః కొత్త ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరకు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 115.27పాయింట్లు లాభపడి 33,370.63లకు చేరగా, నిఫ్టీ 33.20 పాయింట్ల లాభంతో 10,245 పాయింట్ల వద్ద ముగిసింది.
నిన్న లాభాలతో ముగిసిన సూచీలకు నేడు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బలహీనమైన అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో లోహ, హెల్త్‌కేర్‌, టెక్‌, ఐటీ, స్థిరాస్తి రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అయ్యాయి. దీంతో ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 100 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 30 పాయింట్లకు పడిపోయింది.