రెండేళ్లలో ‘వోల్వోకు రెట్టింపు మార్కెట్‌ వాటా

VOLVO
VOLVO

న్యూఢిల్లీ: స్వీడిష్‌ లగ్జరీకార్ల తయారీ సంస్థ వోల్వోకార్స్‌ కొత్త ఉత్పత్తులను భారత్‌కోసం రూపొందిస్తోంది. వచ్చే ఏడాదిపూర్తిగా విద్యుత్‌ వాహనాలను విడుదలచేయాలనినిర్ణయించింది. 2020 నాటికి తన మార్కెట్‌ వాటాను రెట్టింపుచేసుకునే లక్ష్యంతో కొత్తప్రణాళికలు అమలుచేస్తోంది. కంపెనీ దేశంలో 2029 యూనిట్లను గత ఏడాది విక్రయించింది. మార్కెట్‌ వాటా ఐదుశాతంగా ఉంటుందని అంచనా. విద్యుత్‌కార్లతో తమ మొత్తం మార్కెట్‌ వాటా మరింతపెరుగుతుందని హైబ్రిడ్‌కార్ల ఉత్పత్తిని పెంచుతూ ప్రత్యేకించిప్లగ్‌ఇన్‌ హైబ్రిడ్‌కార్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించింది. 2019లోనే ఈకార్లను భారత్‌లో విడుదలచేస్తామని, ఇలగ్జరీ స్పేస్‌లో హైబ్రిడ్‌ కార్లనే ఎక్కువ ఉత్పత్తిచేస్తామని వోల్వో ఆటో ఇండియా ఎండి చార్లెస్‌ ఫ్రంప్‌ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 2025నాటికి పదిలక్షల విద్యుత్‌కార్లను మార్కెట్‌చేయాలనినలక్ష్యంగాపెట్టుకుంది. భారత్‌లో కూడా తమ లక్ష్యంలో సింహభాగం విక్రయించాలనినిర్ణయించినట్లు తెలిపారు. వీటితోపాటు భారత్‌మార్కెట్‌కు సాంప్రదాయ మోడళ్లను కూడా విడుదలచేస్తామని, కొత్తగా కంపాక్ట్‌ లగ్జరీ ఎస్‌యువి ఎక్స్‌సి40 ఈ ఏడాది విడుదలచేసినట్లు ఎండి వివరించారు. 2020 నాటికి తమ పోర్టుఫోలియో మొత్తం అన్ని వెరైటీలతో ఉంటుందన్నారు. ఎస్‌యువిలు, సెడాన్‌లు, లగ్జారీ హ్యాచ్‌బ్యాక్‌లు కూడా ఉత్పత్తిచేస్తామని వివరించారు. మార్కెట్‌ వాటా ఐదుశాతంగా ఉందని, 2020 నాటికి పదిశాతానికి పెంచుకోగలమని ధీమా వ్యక్తంచేసారు. వోల్వోకార్లు పరంగామార్కెట్‌లో లక్ష్యానికి చేరువగా ఉన్నాయని 2017లో 28శాతం అమ్మకాల్లో వృద్ధినిసాధించామని ఫ్రంప్‌ వెల్లడించారు. అమ్మకాల లక్ష్యాన్ని సాధించగలమని భారత్‌లో వచ్చే రెండేళ్లలో తమ విక్రయాలనెట్‌వర్క్‌ను రెట్టింపుచేస్తామని చెపుతున్నారు. దేశవ్యాప్తంగా వోల్వోకార్లకు 18 డీలర్‌షిప్‌లు నడుస్తున్నాయి.