రెండుషోరూంలలో టయోటా ఫార్చూనర్ ఆవిష్కరణ

రెండుషోరూంలలో టయోటా ఫార్చూనర్ ఆవిష్కరణ
హైదరాబాద్, నవంబరు 12: జపాన్‌కు చెందిన టయో టా ఆధునీకరించిన ఫార్చ్యూనర్‌ను దేశీయ విపణి లోనికి విడుదలచేసింది. ఎస్యువి విభాగంలో ఉన్న ఈ వాహనం రెండువెర్షన్లలో లభిస్తుంది. డీజిల్ 2.8 లీటర్లు, పెట్రోలు 2.7 లీటర్ల ఇంజన్లను అమర్చారు. వీటిధరలు ఎక్స్షోరూంఢిల్లీ ధరలూ 25.92 లక్షలు, రూ.31.12 లక్షలుగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. ఏడాదికికనీసం 16వేలకుపైగా ఫార్చూనర్ వాహనాలు విక్రయిస్తున్నామని పెట్రోలురకం తెచ్చినందుకు ఈ సంఖ్యమరింత పెరుగుతుందని భావిస్తున్నామని హర్షా టయోటా సిఒఒ సంజీవ్ కొరిటాల వివరించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమినర్ మహేష్ మురళీ భగవత్, టిన్యూస్ ఎండి జె.సంతోష్‌కుమార్, హర్షాటయోటా సీనియర్జనరల్మేనేజర్ వైబి స్వామి ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. ఫార్చూనర్ వాహనాన్ని రెండుషోరూంలలో ప్రారంభిం చారు. రాధాకృష్ణ టయోటాషోరూంలోహోంమంత్రి నాయినినరసింహారెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మా రావులు లాంఛనంగా ఫార్చూనర్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాధాగ్రూప్ ఉపాధ్య క్షుడు అనిల్‌కుమార్ జక్కన్న, జనరల్మేనేజర్ షబీర్షేక్, సేల్స్‌హెడ్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.