రూ.992కోట్ల విలువైన ఆస్తులు సీజ్‌

INCOME TAX DEPARTMENT
INCOME TAX DEPARTMENT

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.992.52కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేసిందని ఈరోజు పార్లమెంటుకు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన 582 సోదాలు, జప్తుకు సంబంధించి నిర్వహించిన దాడుల్లో ఆదాయపన్ను శాఖ ఇంత విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా లోక్‌సభకు రాతపూర్వక సమాధానంగా వెల్లడించారు.