రూ.9.5 లక్షల వరకూ ట్యాక్స్‌ నిల్‌!

TAX
TAX

న్యూఢిల్లీ: నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు కొంతమేర రాయితీలు కల్పించేందుకు బడ్జెట్‌ ఆధారితప్రజలకు భారం కాకుండా ఆర్ధిక మంత్రి పియూష్‌గోయల్‌ జాగ్రత్తలుతీసుకున్నారు. మొత్తం పన్ను పరిమితి ఐదులక్షలకు పెంచినా వేతన జీవులు ఇతరత్రా ఉన్నవారు సుమారు 9.5లక్షలవరకూ పన్నుభారం లేకుండా కొనసాగే అవకాశాలను పన్ను ఆదా పథకాల్లో పొందుపరిచారు. ఆర్ధికబిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో మాట్లడిని కేంద్ర మంత్రి పన్నురేట్‌లో ఎలాంట ఇమార్పులు తీసుకురాలేదని, అయితే కొన్ని రిబేట్‌లు ప్రస్తావించామన్నారు. దీనివల్ల వ్యయాన్ని పెంచితే ఆర్ధికవృద్ధి మౌలికవనరుల కల్పనతోపాటు ఆర్ధిక వ్యవస్థ పటిష్టం అవుతుందని పేర్కొన్నారు. ఆర్ధికబిల్లులో పన్ను ప్రతిపాదనలు లోక్‌సభ మూజువాణిఓటుతో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. యుపిఎ పాలన తరహాలో కాకుండా మోడీ ఆధ్వర్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఎలాంటి సుంకాలను ప్రతిపాదించలేదు. ఆనాటి ప్రభుత్వం ఎస్‌వియులపై పన్నురేట్‌ను తగ్గించినా ఇపుడు మాత్రం చేయలేదు. ఆర్ధికబిల్లు 2019 ప్రకారంచూస్తే పన్నురిబేట్‌ సాలీనా ఐదులక్షలవరకూ ఉన్నవారికి ఎలాంటి పన్నులేదు. 2500 నుంచి 12,500 ఆదాయపనరిమితులు ఉన్నవారికి పనున్నరిబేట్‌ వర్తిస్తుంది. అలాగే ప్రామాణిక తగ్గింపులు కూడా 40 వేలనుంచి 50వేలకు పెంచారు. ఇక ఆర్ధికబిల్లులో చేసిన మినహాయింపులు ఎక్కువగ ఆసామాన్య మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఉన్నాయి. తాత్కాలిక బడ్జెట్‌ అని ఎలాంటి ప్రతిపాదనలు తీసుకురాలేదని అన్నారు. వచ్చే ప్రభుత్వమే పూర్తికాలపు బడ్జెట్‌నుప్రవేశపెడుతుందని వెల్లడించారు. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు రిబేట్‌ ఇస్తే ప్రతిపక్షాలు ఎదుర్కొనలేని పరిస్థితి ఉంది. అలాగే సన్నచిన్నకారురైతులకు ఆదాయవనరులుసైతం పెంచింది రెండుహెక్టార్ల రైతులకు పన్ను మినహాయింపులతోపాటు వారికి సాలీనా ఆరువేల రూపాయలు ఇస్తోంది. పైదులక్షల ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పనున ఉండదు. వేతన చెల్లింపులు ఉన్నవారికి పన్ను మినహాయింపు టిడిఎస్‌ ఆధారంగా ఉంటుంది. వ్యక్తులు 9 నుంచి రూ.9.5 లక్షలవరకూ ఉన్నవారు ఆదాయపు పన్నుభారం నుంచి బైటపడే అవకాశం ఉందని స్వయంగా ఆర్ధిక మంత్రే వెల్లడించారు. వివిధ పన్ను ఆదా పథకాలతో వీటిని పొందవచ్చన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వంచేపట్టిన సంస్కరణలఫలితంగా పన్ను చెల్లించేవారిబేస్‌ పెరిగింది. ఆదాయపుపన్ను పరిమితి ఐదులక్షలకు పెంచింది. ప్రామాణిక తగ్గింపు 50వేలకు పెంచడం, టిడిఎస్‌ లిమిట్‌ వడ్డీ ఆదాయంపై రూ.10 నుంచి రూ.40వేలకు పెంచడం వంటి సీనియర్‌ సిటిజన్లకు ఎంతో లాభం చేకూరుస్తుంది. ఇక బ్యాంకుల్లో ఎన్‌పిఎలు తగ్గింపునకు ప్రత్యేకకార్యాచరణ అమలుచేయాల్సి ఉంటుంది. గృహిణులు తాముత ఈసుకున్న గృహరుణాలు సకాలంలో చెల్లించేందుకు ఇంట్లో ఒత్తిడి పెంచాల్సి ఉందన్నారు. ఆర్ధికలోటు గణాంకాలపరంగా చూస్తే జిడిపిలో 3.3శాతం లక్ష్యంగా ఈ ఆర్ధికసంవత్సరానికి కేటాయించామని అన్నారు. బడ్జెట్‌ దస్త్రాన్ని చూస్తే ఆర్ధికలోటు 2018-19సంవత్సరంలో 3.4శాతంగా ఉంటుందని, ఇపుడున్న 3.3శాతంనుంచి కొంతపెరుగుతుందనిసైతం ఆర్ధికమంత్రి సెలవిచ్చారు. మొత్తం మీద వేతనజీవులు, ఇతర ఆదాయ వర్గాల ప్రజలు పన్నుచట్టంలో ఉన్న పొదుపు పథకాలద్వారా సుమారు 9 నుంచి రూ.9.5లక్షలవరకూ పన్నుభారం తగ్గించుకోవచ్చని స్వయంగా ఆర్ధిక మంత్రే సెలవిచ్చారు.