రూ.9లకే అపరిమిత కాల్స్‌

vodafone1
vodafone

న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఇండియా రూ.9తో ఒక రోజు కాలపరిమితి కలిగిన అపరిమిత కాలింగ్‌ ప్యాక్‌ను ప్రకటించింది. ఐతే, ఇది ఒక ఉత్తరప్రదేశ్‌కి తూర్పు ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. రూ.9రీచార్జీతో దేశవ్యాప్తంగా ఎక్కడికైనా అపరిమితంగా మాట్లాడుకోవచ్చని దీనికి అదనంగా 100సందేశాలు, 100 ఎంబిపిఎస్‌ డేటాను ఒక రోజు కాలపరిమితితో అర్ధరాత్రి వరకు ఉపయోగించుకోవచ్చని వివరించింది. త్వరలోనే ఈ ప్యాక్‌ను దేశమంతటా విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 74శాతం మంది వొడాఫోన్‌ ఖాతాదారులు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల వారేనని, వారి అవసరాల కోసం ఈ ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వొడాఫోన్‌ ఇండియా యుపి ఈస్ట్‌ బిజినెస్‌ హెడ్‌ నిపుణ్‌శర్మ తెలిపారు.