రూ.899కే ఇండిగో టికెట్లు

INDIGO-
INDIGO

ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌కు చెందిన ఇండిగో దేవీయ విమాన టికెట్లను రూ.899 (అన్నీ కలిపి) నుంచి, అంతర్జాతీయ విమాన టికెట్లను రూ.3399 (అన్నీ కలిపి) నుంచి పరిమిత ప్రయాణ కాలానికి అందజేస్తోంది. విమానయాన సంస్థ వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం కొత్త సంవత్సరం ఆఫర్‌లో భాగంగా వీటిని ప్రకటించింది. జనవరి 9 నుంచి జనవరి 13 మధ్య బుకింగ్‌ చేసుకుని జనవరి 24 నుంచి ఏప్రిల్‌ 15 మధ్య ప్రయాణాలపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. దీని కింద ఢిల్లీ-ముంబయి వంటి రద్దీ రూట్ల మధ్య రూ.2299, ముంబయి-దుబాయ్‌ వంటి అంతర్జాతీయ రద్దీ రూట్ల మధ్య రూ.6699 మేర టికెట్‌ ధర ఉంటోంది.