రూ.8.6లక్షలకోట్లకు ‘హెల్త్‌కేర్‌ రంగంవృద్ధి!

HEALTHCARE
HEALTH CARE

న్యూఢిల్లీ: భారత్‌ హెల్త్‌కేర్‌రంగం 2022నాటికిరూ. 8.6 లక్షలకోట్లకు చేరుతుందన్న అంచనాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆయుష్మాన్‌భారత్‌ పథకంతో హెల్త్‌కేర్‌రంగం వృద్ధి 16.-17శాతంగా ఉంటుందని చెపుతున్నారు. ప్రస్తుతం నాలుగులక్షల కోట్ల రూపాయలటర్నోవర్‌తో హెల్త్‌కేర్‌రంగం కొనసాగుతోంది. కేంద్రం ఈ బీమా పథకం విజయవంతంగా అమలుచేస్తే టర్నోవర్‌మరింతగాపెరుగుతుంది. ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో ఇటీవలే పెరిగినకొనుగోళ్లు వంటివి హెల్త్‌కేర్‌రంగంపై ఇన్వెస్టర్ల ఆసక్తిసైతం పెరుగుతున్నదని స్పష్టం అవుతోంది. దేశంలో వైద్యరంగంలోని పడకల సామర్ధ్యం, వైద్యప్రాక్టీషనర్ల అనుభవం, ప్రభుత్వ మెగా ప్లాన్‌హెల్త్‌కేర్‌రంగం విస్తరణ వంటివి కొంతకీలకం అవుతాయి. అలాగే ఆయుష్మాన్‌భారత్‌ స్కీం హెల్త్‌కేర్‌ రాబడులు పెంచుతుందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌ అంచనావేసింది. ఈస్కీం విజయవంతంగా అమలయితే హెల్త్‌కేర్‌సేవల మార్కెట్‌ బహుళవిధాలుగాపెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న వైద్యులసంఖ్య రెట్టింపు కావాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక్కొక్కడాక్టరుకు పడకల నిష్పతినిసైతం బేరీజువేయాల్సిన అవసరం ఉంది. ఆయుష్మాన్‌భారత్‌ స్కీం వల్ల ఆసుపత్రులకు వృద్ధి అవకాశాలు సుమారుగా 50 లక్షలకోట్లవరకూ పెరుగుతుందని అయితే ఈపథకం అమలు విజయవంతంపైనే హెల్త్‌కేర్‌రంగ వృద్ధి ఉంటుందని ఐసిఐసిఐవెల్లడించింది. దేశంలోప్రస్తుతం ప్రతి వెయ్యిమందికి ఏడు పడకలు మాత్రమే ఉన్నాయి. అదే ప్రంచ సగటును చూస్తే ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసులు 3.5పడకలుగా ఉన్నాయి. అందువల్లనే ఆసుపత్రులు నిరంతరం విస్తరణ పథంలో ఉన్నాయి. ఇక మానవవనరులపరంగా ప్రతి వెయ్యిమందికి 0.7మంది వైద్యులు, 1.7మంది నర్సులున్నారు. అదే ప్రపంచ సగటును పరిగణనలోనికి తీసుకునంటే 1.4 మంది వైద్యులు, 2.9 మంది నర్సులున్నారు. ఆయుష్మాన్‌భారత్‌ లక్ష్యం గ్రామీణమారుమూల గ్రామాలకుసైతం అందుబాటులోవైద్యం అంటే ఉచితవైద్యఐదులక్షల రూపాయలవరకూ అందించాల్సి ఉంటుంది. సుమారు పదికోట్ల మంది కుటుంబాలకు ఈచికిత్సలు అమలుకావాల్సిందేనని ప్రభుత్వం చెపుతోంది. ప్రపంచంలోనే ప్రభుత్వ నిధులతో అమలవుతున్న అతిపెద్ద పథకంగా ఆయుష్మాన్‌భారత్‌ ఉంది. దీనివల్ల మార్కెట్‌ అవకాశాలు రూ.50లక్షలకోట్లకుపెరుగుతాయని అంచనా. ఇక ధరలు, మార్జిన్లపరంగా హెల్త్‌కేర్‌రంగం ఇటీవలికాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. దీనివల్లనే ప్రభుత్వం తక్కువఖర్చుతో వైద్యసేవలు అందించేలక్ష్యంతో బీమా పథకం అమలుకు తెస్తున్నది. ఎన్ని సవాళ్లు ఎదురైనా హెల్త్‌కేర్‌రంగానికి ఎంతో వృద్ధిని చేకూరుస్తుందని నిపుణులు చెపుతున్నారు. ధరల సవాళ్లను అధిగమించేందుకు ఆసుపత్రులు విభిన్న ప్రత్యేకతల మిక్స్‌ను పంపించాలి. ఒకే వైద్యవిధానంతోకాకుండా విభిన్న తరహా రుగ్మతలకు, రోగాలకు చికిత్సలు అందించగలిగితేహెల్త్‌కేర్‌మరింత విస్తరించినట్లవుతుందని చెపుతున్నారు.