రూ.6.56 లక్షలకోట్ల పన్నులవసూళ్లు

TAX
TAX

న్యూఢిల్లీ: ఆర్ధికలోటు భర్తీకోసం ప్రభుత్వం ఓవైపుప్రభుత్వపరంగా బాండ్లను విడుదలచేసి లోటును కట్టడిచేయాలని చూస్తున్న తరుణంలోప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఆర్ధిక భారం తగ్గించాయి. డిసెంబరు నెలచివరివరకూ చూస్తే 18.2శాతం పెరిగాయి. పన్నులపరంగా ఈ ఏడాది లక్ష్యం 15.7శాతంపెరిగినట్లు బడ్జెట్‌ అంచనాల్లోనే వెల్లడించింది. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 6.56 లక్షలకోట్లరూపాయలకు పెరిగాయి. బడ్జెట్‌అంచనాలు రూ.9.8 లక్షలకోట్లలో 67శాతంగా తేలింది. జిడిపిలో ఆర్ధికలోటును 3.2శాతానికి కట్టడిచేస్తామన్నప్రభుత్వ లక్ష్యాన్ని ఈ వసూళ్లు సానుకూలం చేస్తున్నాయి. జిఎస్‌టి,ఆర్‌బిఐ మిగులు నిధుల బదిలీ, స్పెక్ట్రమ్‌రాబడులు కొంతమేర లోటును తగ్గించేందుకు దోహదంచేసాయనే చెప్పాలి. ప్రభుత్వం ఈ ఖాతాలనుంచి ఇప్పటికి 500 బిలియన్‌రూపాయల నిధులు రావాల్సిన అంశంపై దృష్టిసారించింది. ఆర్ధికలోటు లక్ష్యంకూడా వృద్ధి మందగించడంవల్లపెరిగే అవకాశం ఉందని అందువల్లన జిడిపిలో లోటుశాతం కూడా పెరుగుతుందని బడ్జెట్‌అంచనాల్లోచూపించింది. జిడిపి ముందస్తు అంచనాలపరంగాచూస్తే శుక్రవారం విడుదలచేసినగణాంకాల్లో జిడిపి సాధారణస్థాయి లో 3.3శాతంగాలోటు ఉంటుందని, 3.2శాతం లక్ష్యంకంటే పెరుగుతుందని వెల్లడించారు. రూ.5.6 లక్షలకోట్ల బడ్జెట్‌అంచనాలకు పరిమితం అయినా లోటు మరికొంత పెరుగుతుందని నిపుణులసైతం అంచనావేసారు. కేంద్ర అర్ధగణాంకశాఖ జిడిపి ప్రస్తుత ధరల వద్ద 166లక్షలకోట్లరూపాయలుగా నిలిచింది. అంతకుముందు ఏడాది 152 లక్షలకోట్లుగా చూపించారు.ప్రభుత్వం నవంబరు చివరినాటికి ఆర్ధికలోటు లక్ష్యఆనికి 112శాతంగా ఉందని, బడ్జెట్‌లో మరింతపెరిగే అవకాశం ఉందని చూపించింది. బడ్జెట్‌అంచనాలకంటే ఎక్కువ తేడా కనిపించింది. మొదటి ఎనిమిదినెలల్లో లోటు మరింతగాపెరగడంతో లోటు కట్టడికి రాబడులు పెంచుకునే యంత్రాంగాన్ని అదిలించింది. స్థూలప్రత్యక్ష పన్నులపరంగా చూస్తే 12.6శాతంపెరిగి 7.68 లక్షల కోట్లరూపాయలుగా నిలిచాయి. ఇకరిఫండ్లు కూడా 1.12 లక్షలకోట్లుగా ఉంటాయని అంచనావేసింది. అడ్వాన్సు పన్నురూపంలో రూ.3.18 లక్షలకోట్లువచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది వసూళ్లకంటే 12.7శాతంపెరిగాయి. కార్పొరేట్‌ముందస్తుపన్నుపరంగా కూడా 10.9శాతం పెరిగింది. ఇక వ్యక్తిగత ఆదాయపు పన్నుశాతంపరంగా 21.6శాతంగావృద్ధినమోదయిందనిప్రభుత్వం వెల్లడించింది. వీటన్నింటి దృష్ట్యాఆర్ధికలోటు కట్టడికి పన్నువసూళ్లు మరింతగా దోహదంచేశాయన్న ఆర్ధికనిపుణుల వాదనల్లో నిజంలేకపోలేదని అధికార వర్గాలుసైతం అంగీకరిస్తున్నాయి.