రూ.4500 కోట్ల రిటైల్‌ ఫైనాన్స్‌

EDELVISI
ఎడెల్విసిస్‌ రిటైల్‌ఫైనాన్స్‌హెడ్ అనిల్‌కొత్తూరి
హైదరాబాద్‌ : తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్‌లలో వచ్చేఐదేళ్లలో గృహరుణాలకు డిమాండ్‌ రెట్టింపు అవుతుందని ఎడెల్విసిస్‌ రిటైల్‌ఫైనాన్స్‌ హెడ్‌ అనిల్‌కొత్తూరి వెల్లడించారు. అందరికీ ఇళ్లు అన్న ప్రభుత్వ ప్రణాళికలో భారతీయ గృహమార్కెట్‌కు డిమాండ్‌ పెరిగిందన్నారు. ప్రస్తుతం ఇఆర్‌ఎఫ్‌ రుణాలు రూ.4500 కోట్ల వరకూ ఉన్నాయని, రుణాలు పదివేల మంది వినియోగ దారులకు దేశ వ్యాప్తంగా ఉన్న శాఖలతో అందించగలిగామని, అదనంగా 1.8లక్షలమంది కస్టమరక్లకు గ్రామీణఫైనాన్స్‌ద్వారా కవర్‌ చేస్తున్నట్లు అనిల్‌కొత్తూరి వివరించారు. గడచిన మూడ ేళ్లలో చిన్నమొత్తాల్లోరుణాలు తీసుకునే కస్టమర్లకు ఎక్కువ శాతం రుణాలిచ్చినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో వెయ్యిమంది క్రియాశీలక కస్టమర్లు ఉన్నారన్నారు. 35శాతం వృద్ధి నమోదయిందని, సగటు హోమ్‌లోన్‌ 23లక్షల రూపాయలుగా ఉందన్నారు. గృహరుణాల విభాగం హెడ్‌ ఎస్‌వి బాలసుబ్రహ్మణియన్‌ మాట్లాడుతూ చందానగర్‌లో కొత్తశాఖ ప్రారంభించడం ద్వారా గ్రామీణ, పట్టణగృహపథకాలకు మరింత చేరువ అయినట్లు తెలిపారు. అర్బన్‌హౌసింగ్‌ పట్టణాల్లోను, గ్రామీణ పక్కాగృహాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అమలుచేస్తామన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లలో ఎడెల్విసిస్‌ రిటైల్‌ఫైనాన్స్‌8 శాఖలుందని, హైదరాబాద్‌ అత్యంత ముఖ్యమైన నగరమని అందువల్లనే చందానగర్‌శాఖతో మరింత విస్తరించినట్లు తెలిపారు.