రూ.3500కోట్ల నిధుల సమీకరణ ‘ఐడియా

IDEA
IDEA

న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్‌ కంపెనీ నిధుల సమీకరణకు నిర్ణయించింది. అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లనుంచి రూ.3500 కోట్ల నిధుల సమీకరిస్తామని ప్రకటించింది. ఒక్కొక్క వాటాధర రూ.82.50గా నిర్ణయించింది. కంపెనీకి ఉన్న మూలధన నిధుల సమీకరణ కమిటీ బుధవారం సమావేశమై క్యూఐపిని ఆమోదించింది. ఈక్విటీ వాటాలు రూ.82.50గానిర్ణయించింది. ప్రీమియంధర 72.50గా ఉంది. మొత్తం 42.42 కోట్ల ఈక్విటీ వాటాలను సుమారు రూ.3500 కోట్లవరకూ సమీకరించాలనినిర్ణయించింది. క్యూఐపి విధానానికి అనుగుణంగా మాత్రమే ఈనిధుల సమీకరణ ఉంటుంది. బిర్లా టిఎంటి, ఎలైన్‌, ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఒరానియా ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రస్తుతం ఐడియా సెల్యులర్‌లో ఇన్వెస్టర్లు వాటాదారులుగా ఉన్నారు. ఇప్పటికే వారు రూ.3250 కోట్ల పెట్టుబడులు పెట్టారు. వొడాఫోన్‌ ఇండియాతో విలీనానికి ముందే ఈ సమీకరణ జరిగింది. సంస్థాగత అర్హులైన పెట్టుబడుల ప్రకారంచూస్తే భారత్‌ ఊడో అదిపెద్ద టెలికాం ఆపరేటర్‌ 47.2శాతంకు పెంచుకోవాలనినిర్ణయించింది. ప్రస్తుతం 42.4శాతంమాత్రమే ఉంది. గతనెలలో ఐడియా నిధుల సమీకరణ తన టవర్లవ్యాపారాన్ని అమెరికన్‌టవర్‌ కార్ప్‌కు విక్రయించింది. సంస్థలోని 1.15శాతం వాటాలను విక్రయించింది. దీర్ఘకాలిక మూలధన వనరులకోసం తనకు ఉన్న ఇండస్‌ టవర్స్‌లో వాటా విక్రయించింది. ఈనిధుల సమీకరణతో కంపెనీ టెలికాంరంగంలో ఉన్న పోటీని ఎదుర్కొనగలదని నిపుణుల అంచనా.