రూ.2050 కోట్ల సేవాపన్ను ఎగవేత!

LIC
LIC

రూ.2050 కోట్ల సేవాపన్ను ఎగవేత!

కోల్‌కత్తా: భారతీయ జీవితబీమా సంస్థ సేవాపన్ను ఎగవేసిందని జిఎస్‌టి ఇంటిలిజెన్స్‌ డైరెక్టరేట్‌నుంచి నోటీసులు అందుకుంది. రూ.2050 కోట్లు చెల్లించాలని డిమాండ్‌నోటీస్‌ పంపించింది. కోల్‌కత్తా జోనల్‌ కార్యా లయంఅధికారులు ఈ నోటీసులు పంపించారు. సేవాపన్ను ఎగవేసేందుకుగాను ఉద్దేశ్య పూర్వకంగానే వాస్తవాలను దాచిపెట్టిందని పన్నుల శాఖ అధికారులు అభియోగాలు నమోదుచేసారు. అలాగే విధివిధానాలనుసైతం ఉల్లంఘించిందని, ప్రీమియం చెల్లించనికారణంగా పాలసీలు సైతం నిలిచిపోయిన వివరాలను దాచిపెట్టిందని వెల్లడిం చింది. డైరెక్టరేట్‌జనరల్‌ జిఎస్‌టి ఇంటిలిజెన్స్‌ కార్యాలయం తన నోటీసులు ఎల్‌ఐసి సేవాప న్నును ఈ నిలిచిపోయిన పాలసీలకు 2012 జూలై నుంచి చెలించడంలేదని వెల్లడించింది. నోటీసు అందినమాట నిజమేనని ఎల్‌ఐసి అధికారులు వెల్లడించారు. ఆర్ధికచట్టంలోని కొన్ని అధికరణలను అనుసరించి పన్నులశాఖ అధికారులు చెపుతున్న వివరాలను అధ్యయనంచేస్తామని, అయితే తాము ఈ నోటీస్‌కు సమాధానం కూడా ఇచ్చామన్నారు.

ఎలాంటి వాస్తవాలను దాచిపెట్టలేదని వెల్లడిం చారు. ఇప్పటికే నోటీసుకు సమాధానం ఇచ్చామ ని, అన్ని దస్త్రాలు, వాస్తవాలు, ఇందుకు సంబం ధించిన వివరణలు డిజిజిఐ కోరినవిధంగా అంద చేసినట్లు వివరించారు. దేశంలోనే ఎక్కువశాతం పన్ను చెల్లించే సంస్థగాను, నిక్కచ్చిగా పన్నులుచెల్లించే సంస్థగా ఎల్‌ఐసికి పేరుంది. మాపరంగా పూర్తి వివరాలు అందచేసామని, ఎలాంటి వాస్తవాలను మరుగునపరచలేదని ఎల్‌ఐసి వెల్లడించింది. అలాగే పన్నులు ఎగవేయాలన్న దురాలోచన కూడా సంస్థకు లేదని ప్రభుత్వరంగ సంస్థ ఎల్‌ఐసి అని అధికారులు గుర్తుచేసారు.

కోల్‌కత్తా డిజిజిఐ నోటీస్‌ దేశంలోని 23 ఎల్‌ఐసి కంపెనీలకు ఒక చురకవేసినట్లయింది. ఎల్‌ఐసితోపాటే మరికొన్ని సంస్థలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. జిఎస్టఇ నిపుణులు సంజీబ్‌ కొఠారి మాట్లాడుతూ కంపెనీలు కొన్ని సందర్భాల్లో సడలింపులు ఇవ్వాల్సి ఉం టుందని, ఇలాంటికేసుల్లో ముందుగానే పన్నులుచెల్లించి ఆ తర్వాత జరిమానా, వడ్డీ విభాగాలను రద్దుచేయాలని కోరతా మని అన్నారు. బకాయిదారులు మొత్తం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని, వారి అభియోగాలను కొట్టివేసినా మొత్త ంసొమ్ము జరిమానాతోసహా చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ దస్త్రాలపరంగాచూస్తే ఎల్‌ఐసి ఎండోమెంట్‌ పాల సీలు అంతకుముందు ఆ తర్వాత కూడా చట్టప రమైన విధివిధానాలు పాటించలేదని, 1994 ఆర్ధికచట్టంపరిధిలో వీటిని ఖచ్చితంగా పాటిం చాలిస ఉంటుందని వెల్లడించింది. 2012జులై నుంచి ఈ ఆర్ధికచట్టం నిబంధనలు అమలుకు వచ్చిందని జిఎస్‌టి డిజిజిఐ వెల్లడించింది.