రూ.1900 కోట్ల ఐపిఒకు ఎయుస్మాల్‌ ఫైనాన్స్‌బ్యాంకు

AU
AU

రూ.1900 కోట్ల ఐపిఒకు ఎయుస్మాల్‌ ఫైనాన్స్‌బ్యాంకు

ముంబయి,జూన్‌ 27: ఎయుస్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంక్‌ పబ్లిక్‌ఇష్యూ వచ్చే బుధవారం మొదలవుతోంది. 28వ తేదీ ప్రారంభించి 30వ తేదీ శుక్రవారం ముగుస్తున్న ఈఇష్యూకు ధరలు రూ.355-358గా నిర్ణయిం చింది. ఈఐపిఒతో కంపెనీ రూ.1900 కోట్లు నిధులు సమీకరించాలనినిర్ణయించింది. ఆఫర్‌లో భాగంగా మొత్తం 5.3కోట్లషేర్లను అమ్మకంపెడుతోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 41షేర్లకు దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.

అంతకుమించి చేసుకోవాలంటే ఇవే గుణిజాల్లో రూ.2 లక్షలకు మించకుండా బిడ్‌దాఖలుచేయవచ్చు. 1066లో రాజస్థాన్‌ లోని జైపూర్‌లో ఎయుఫైనాన్షియర్స్‌గా కార్యకలాపాలు ప్రారంభిం చిన కంపెనీ ఎన్‌బిఎఫ్‌సిగా రిజర్వుబ్యాంకు గుర్తింపు పొందింది. ఉత్తరాది మార్ట్కెట్లలో రిటైల్‌ ఫైనాన్సింగ్‌పై ప్రధానంగా దృష్టిని పెట్టింది. మధ్యతక్కువస్థాయి ఆదాయంఆర్జించే వ్యక్తులకు రుణా లివ్వడం ద్వారా బిజినెస్‌ పెంచుకుంటూ వచ్చింది ఈ బాటలో గత ఏడాది డిసెంబరు 20వ తేదీ రిజర్వుబ్యాంకు నుంచి స్మాల్‌ఫైనాన్స్‌బ్యాంకు లైసెన్సును పొందింది.

ప్రస్తుతం కంపెనీ కార్యకలాపాలు మూడు ప్రధాన కేటగిరీల్లో విస్తరించాయి. వాహనఫైనాన్స్‌, సూక్ష్మ రుణ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎస్‌ఎంఇ విభాగాలకు రుణాలు అందిస్తోంది. సుమారు పదిరాష్ట్రాల్లో 300 బ్రాంచిలను ఏర్పాటుచేసింది. కాగా వచ్చేఏడాది 2018-19తొలిత్రైమాసికంలో ఏప్రిల్‌ జూన్‌కల్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌లో ప్రవేశించేప్రణాళికలు వేసినట్లు ఎండిసిఇఒ సంజ§్‌ు అగర్వాల్‌ వెల్లడించారు. 2013-17 మధ్య కాలంలో కంపెనీ రుణరికార్డు సగటున 30శాతం చొప్పున అభివృద్ధిని సాధించింది. నికరలాభం 47శాతం స్థాయిలో వృద్ధినిసాధించింది. రుణాలపై స్థూల మొండిబకాయిలు 1.6శాతం స్తాయిలోనే కట్టడికాగా 2017 కల్లా స్థిరాస్తులపై రిటర్నులు 3.4శాతంగా నమోదయింది. ఈక్విటీ రిటర్నులుసైతం 21.7శాతంగా ఉన్నాయి. =========