రూ.11వేల కోట్లకు ఎస్‌బిఐ సంస్థాగత నిధుల సమీకరణ

sbi
Arundati bhattacharya

రూ.11వేల కోట్లకు ఎస్‌బిఐ సంస్థాగత నిధుల సమీకరణ

ముంబయి, జూన్‌ 8: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌బ్యాంకు తన వాటాల విక్రయాన్ని ప్రైవేటు ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో ప్రారంభించింది. కేపిటల్‌ అడక్వసీ రేషియోను పాటించేందుకువీలుగా మొత్తం రూ.11వేల కోట్ల నిధులు సమీకరించాలని నిర్ణయించింది. మొత్తంగాచూస్తే ఈ ఆర్ధ్థిసంవత్స రంలో బ్యాంకు మార్కెట్ల నుంచి రూ.15 వేల కోట్లు సమీకరిస్తుందని అంచనా. సంస్థాగత అర్హులైన ఇన్వె స్టర్లకు వాటా విక్రయం ద్వారా 11వేల కోట్లు సమీకరి స్తామని ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకుషేర్లు ముఖ విలువ ఒక రూపాయిగా ఉంది. కేటాయింపు ధరలు రూ.287.58గా నిర్ణయించింది. ఈనెల ఐదవ తేదీనుంచి విక్రయం ప్రారంభించినట్లు ఎక్చేంజి లకు నివేదికఇచ్చింది. బ్యాంకు ఐదుశాతానికి మించి డిస్కౌంట్‌ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. ఎస్‌బిఐ క్యూఐపి ప్రోగ్రాం ద్వారానే రూ.11 వేల కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ కింద రైట్స్‌ఇష్యూకు కూడా వస్తోంది. క్యూఐపి, అమెరికన్‌డిపాజిటరీ రిసీప్ట్స్‌(ఎడిఆర్‌), గ్లోబల్‌ డిపాజి టరీ రిసీప్ట్స్‌(జిడిఆర్‌) ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్స్‌ వంటిపథకాల్లో నిధులు సమీకరిస్తోంది. బ్యాంకుస్టాక్‌ బిఎస్‌ఇలో 285.85వద్ద ముగిసింది. మొత్తంసంఘటిత వ్యాపారాన్నిచూస్తే బ్యాంకు డిపాజిట్లు రూ.25,99,811 వద్ద నిలిచాయి. మార్చి ముగిసేనాటికి అడ్వాన్సులు రూ.18,96,887 కోట్లుగా ఉన్నాయి.