రూ.10,300 కోట్లతో టిసిఎస్‌ షేర్ల బైబాక్‌

TATA
TATA

రూ.10,300 కోట్లతో టిసిఎస్‌ షేర్ల బైబాక్‌

ముంబయి, జూన్‌ 9: టాటాగ్రూప్‌ సంస్థలప్రమోటింగ్‌ కంపెనీ టాటాసన్స్‌ ఇటీవల చేపట్టిన షేర్‌బైబాక్‌ పథ కం ద్వారా 10,300 కోట్ల రూపాయలు టిసిఎస్‌ నుంచి వ్యయంచేసింది. 16వేల కోట్ల రూపాయలు షేర్‌బైబాక్‌ పథకాన్ని టిసిఎస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌లోనే అతిపెద్ద ఐటి సేవల కంపె నీగా నిలిచిన టిసిఎస్‌ మొదట 16వేల కోట్ల రూపా యలతో మెగా బైబాక్‌ను ప్రకటించింది. గత మేనెల 18వ తేదీ నుంచి ప్రారంభించి అదేనెల 31వ తేదీ ముగించింది.

మొత్తం 5.61కోట్ల షేర్లను రూ.2850 వద్ద వాటాలను కేటాయించింది. మొత్తం 3.60 కోట్ల షేర్లనుబైబాక్‌ కింద కొనుగోలుచేసింది. మొత్తం వాటా ల్లో 64.2శాతం విలువలతో ఉంటాయని ప్రకటిం చింది. ఇతర ఇన్వెస్టర్లపరంగాచూస్తే సింగపూర్‌ప్రభు త్వం, కాప్‌టహల్‌ మారిషస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, యూరోపసిఫిక్‌ గ్రోత్‌ఫండ్‌ వంటివి ఉన్నాయి. సింగపూర్‌ ప్రభుత్వానికి రూ.335కోట్లు అందాయి. కాప్ట్‌హాల్‌ మారిషస్‌కు 187 కోట్లు, యూరోపసిఫిక్‌ గ్రోత్‌ఫండ్‌ కు రూ.161 కోట్లు ఈ బైబాక్‌ద్వారా నిధులు అందాయి. ఇక చిన్న వాటాదారుల నుంచి స్పందన తక్కువగా ఉంది. సాధారణ కేటగిరీలో ఆర్థికసంస్థలు, విదేశీ ఇన్వెస్టర్లు 12కోట్ల షేర్లను కొనుగోలుకు టెండర్లు దాఖలుచేసారు. వాస్తవానికి వారికి 4.7 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి. భార తీయ ఐటి కంపెనీలు తమవద్ద ఉన్న అదనపు నగదు నిల్వలను షేర్‌బ్యాంక్‌ద్వారా ఖర్చుచేయాలని, లేదా డివిడెండ్లు అయినా ప్రకటించాలన్న డిమాండ్‌ వాటాదారుల నుంచి ఎక్కువ ఉంది. టిసిఎస్‌ ప్రత్యర్ధి సంస్థ ఇన్ఫోసిస్‌ కూడా 13వేల కోట్ల షేర్ల బైబాక్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.