రూ.100 కోట్లు దాటిన కుబేరులు 61 మందే!

TAX
TAX

పార్లమెంటుకు ఆర్ధికమంత్రి నివేదిక
న్యూఢిల్లీ: ఆదాయపుపన్నుశాఖపరిధిలో దేశవ్యాప్తంగా కేవలం 61 మంది మాత్రమే రూ.100 కోట్లు ఆదాయవనరులు దాటినసంపన్నులుగా ఉన్నారు. 2017-18 అసెస్‌మెంట్‌సంవత్సరానికి సంబంధిచి ఐటి శాఖ రూపొందించిన రిటర్నులను పరిశీలించిన సిబిడిటి నివేదికలను పార్లమెంటులో ఆర్ధికశాఖ సహాయ మంత్రి శివప్రతాప్‌శుక్లా వెల్లడించారు. అలాగే వీరందరిపైనా పరివీలనచేసి బినామి ఆస్తుల లావాదేవీల చట్టంపరిధిలోచర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆదాయపు పన్నుశాఖ అధికారులు గత ఏడాది డిసెంబరు వరకూ మొత్తం రెండువేల బినామీ ఆస్తులను గుర్తించినట్లుమంత్రి వివరించారు. మొత్తం 61 మంది మాత్రమే తమ వార్షిక ఆదాయం రూ.100 కోట్లుగా ఉన్నట్లు రిటర్నులు దాఖలుచేసినట్లు మంత్రి వివరించారు. 2014-15లో అదే సంఖ్య కేవలం 24 మంది మాత్రమే ఉన్నారని, క్రమేపీ సంఖ్యపెరుగుతున్నదని చెప్పారు. బిలియనీర్‌గా వర్గీకరించేందుకు అధికారిక నిర్వచనం ఏదీలేదన్నారు. బినామీ లావాదేవీల చట్టంపరిధిలో ఇప్పటివరకూ రూ.6900 కోట్ల విలువైన ఆస్తులను జప్తుచేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకూ రెండువేలకుపైగా బినామీ ఆస్తులను గుర్తించామన్నారు. వీటిలోబ్యాంకు డిపాజిట్లు, ఇళ్ల స్థలాలు, ఫ్లాట్‌లు, ఆభరణాలు వంటివి ఉన్నాయన్నారు. వీటన్నింటినీ చట్టప్రకారం చూస్తే 1800 కేసుల్లో జప్తుచేసినట్లు ఆర్ధికశాఖ సహాయ మంత్రి వెల్లడించారు.