రూ.10కోట్ల పెట్టుబడితో రూ.275కోట్ల రాబడి!

RELIANCEFFF
RELIANCE

రూ.10కోట్ల పెట్టుబడితో రూ.275కోట్ల రాబడి!

 

న్యూఢిల్లీ మార్చి 7: పేటిఎంలో తన వాటాలను విక్ర యించడం ద్వారా అనిల్‌ అంబానికి చెందిన రిల యన్స్‌ క్యాపిటల్‌ రూ.275 కోట్ల రాబడులు సాధిం చింది.చైనాకు చెందిన ఆలిబాబాగ్రూప్‌కు తన వాటాలను విక్రయించింది. రిలయన్స్‌ గ్రూపు లోని ఆర్ధికసే వల విభాగం పేటిఎంలో రూ.10 కోట్లు మాత్రమే పెట్టుబడులు పెడితే నేడు అమ్మకంద్వారా మొత్తం 275 కోట్లు సాధించింది. ఈ డీల్‌ద్వారా పేటిఎం విలువలు మరో నాలుగు వందల కోట్ల డాలర్లు పెరిగాయి. పేటిఎంలో ఇప్పటికే ఆలిబాబా సంస్థ పెట్టుబడులు పెడు తోంది. వ్యూహాత్మక ఇన్వెస్టరుగా ఉంది. మాతృ సంస్థలో పెట్టుబడులు పెట్టడంద్వారా పేటిఎం ఈకామర్స్‌లో వాటాలుమాత్రం అలాగే కొనసాగిం చింది. తాజా నిధుల సమీకరణ రౌండ్‌లో పేటిఎం ఇకామర్స్‌ విభాగం 100 కోట్ల డాలర్ల విలువ చేస్తుందని అంచనావేస్తున్నారు. రిలయన్స్‌క్యాపి టల్‌, పేటిఎం అధికార ప్రతినిధులు ఈ డీల్‌పై స్పందించేందుకు ముందుకురాలేదు.

అంతకు ముందు రిలయన్స్‌క్యాపిటల్‌ కీలకంగాలేని సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ద్వారా నిధులను మరింత వృద్ధిచేసుకుంటామని ప్రకటిం చింది. రిలయన్స్‌ క్యాపిటల్‌పరంగా తన పెట్టు బడులను పురనరేకీకరణ చేసుకునేక్రమంలో భాగంగానే ఈ అమ్మకాలు జరుపుతోంది. గత ఏడాది డిసెంబరులో పేటిఎం వ్యవస్థాపకుడు సిఇఒ విజ§్‌ుశేఖర్‌శర్మ ఒకటిశాతం వాటాలను విక్ర యించడం ద్వారా 325 కోట్లునిధులు సమీ కరిం చారు. వన్‌97 కమ్యూనికేషన్స్‌ పేటిఎం హో ల్డింగ్‌కంపెనీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గ్రూప్‌ ఆధ్వర్యంలో పేమెంట్‌ బ్యాంక్‌ కార్యకలా పాలకోసం ఈనిధులను వినియోగిస్తామని ప్రకటిం చారు. ఆలిబాబా సింగపూర్‌ ఇకామర్స్‌, సెయిఫ్‌ పార్టనర్స్‌, వంటి సంస్తలు కూడా పేటిఎం ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ సంస్థలో 200 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టారు.