రూపాయి మారకం విలువల్లో భారీ పతనం

CASHFFf
cash

రూపాయి మారకం విలువల్లో భారీ పతనం

న్యూఢిల్లీ, నవంబరు 11: డాలరుతో రూపాయి మారకం విలువలు భారీగా క్షీణించాయి. శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 54 పైసలు క్షీణించి 67.17రూపాయలవద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా ఆర్ధిక మార్కెట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం కొంతమేర స్టాక్‌, కరెన్సీ మార్కె ట్లలో మార్పులు తెస్తుందన్న అంచనాలు వేస్తున్నారు. ఆసియా షేర్లు కొంతమేర దిగజారాయి. వర్ధమాన మార్కెట్‌ కరెన్సీలు భారత్‌ రూపాయితో సహా దిగజారాయి. ట్రంప్‌ విజయం తర్వాత వడ్డీరేట్లు పెరిగితే పెట్టు బడులు ఎక్కువ వెనక్కి మళ్లుతాయన్న ఆందో ళనల్లో ఇన్వెస్టర్లున్నారు. మోర్గాన్‌ స్టాన్లీ కేపిటల్‌ సూచీని పరిశీలిస్తే జపాన్‌ బయటి ఆసియా పసిఫిక్‌షేర్లు 1.4శాతం దిగజారా యి. ట్రంప్‌ వ్యయప్రణాళికలు ద్రవ్యోల్బణా న్ని పెంచుతాయన్న అంచనాలే ఇందుకు కారణంగా ట్రేడర్లు చెపుతున్నారు. అంతేకాకుం డా ఫెడ్‌రిజర్వు ఫండ్‌రేట్‌లను పెంచగలదన్న ధీమా కూడా వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఫెడ్‌ రిజర్వు డిసెంబరులో వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచ నాలను ప్రకటించింది. దీనివల్ల అమెరికా మార్కెట్లకు స్థిరత్వం వస్తుందని ఇన్వెస్టర్లు అధ్యయనం చేస్తున్నారు. ఇక ఫెడ్‌ఱిజర్వు వడ్డీరేట్లు పెంచితే విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌, ఇతర వర్ధమాన దేశాల్లోని పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుందని అంచనా. భారత్‌ మార్కెట్లు ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఎక్కువ విలువలున్న బ్యాంక్‌నోట్ల చెలామణి రద్దు వంటివాటితో తీవ్ర ఒత్తిడికి లోనయ్యా యి. తదనంతరం వెనువెంటనే కొంత రికవరీ కాగలిగాయి. అంతే కాకుండా అంతర్జాతీయ ధోరణులపరంగాచూస్తే వేచిచూసే ధోరణి వ్యక్తం అవు తోంది.అ మెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్‌ట్రంప్‌ ఎన్నిక తర్వాత మార్కెట్లు కొంత రికవరీఅయ్యాయి. ఒకే సమైక్యప్రజగా కొనసాగాలని అమెరికన్ల కు పిలుపు ఇవ్వడం మార్కెట్లపై సానునకూల ప్రభావాలు చూపిం చింది. అమెరికాబాండ్‌ మార్కెట్లు ట్రంప్‌ విజయం తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పదేళ్ల అమెరికా ట్రెజరీ రాబడులు 10 నెలల గరిష్టస్థాయికి వెళ్లిపోయాయి. భారత్‌ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సుమారు 45వేల కోట్ల రూపాయలు పెట్టు బడులు పెట్టారు. వాల్‌స్ట్రీట్‌పరంగా డౌజోన్స్‌ పారిశ్రామిక సగటు 1.2శాతం పెరిగింది. గతంలో ఆగస్టులో సాధించిన ఒకటిశాతం రికార్డును సైతం అధిగ మించింది. మొత్తంగాచూస్తే అంతర్జాతీయం గా కూడా డాలర్‌ పటిష్టం అవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వర్ధమాన దేశా లపై ఈ ప్రభావం ఎక్కువ ఉంది. ఇంటర్‌ బ్యాంక్‌ విదేశీ కరెన్సీ మార్పిడి మార్కెట్లలో అమెరికా కరెన్సీ భారీగా పెరుగుతున్నది. విదేశీఫండ్‌ ఉపసంహ రణ ఎక్కువఉంది. దిగుమతిదారుల నుం చి పటిష్టమైన డిమాండ్‌ రావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు దిగువస్థాయినుంచి ట్రేడింగ్‌ ప్రారంభించడం కూడా ఇందుకు కొంత కారణం అయినట్లు ఈపరిస్థితులపై రూపాయిపై భారం పెంచా యని ఫోరెక్స్‌ డీలర్లు చెపుతున్నారు. విదేశాల్లోని కొన్ని దేశాల కరెన్సీలపై ఢాలర్‌ నాలుగునెలల గరిష్టస్థాయికి పెరిగింది. ట్రంప్‌ భారీ వ్యయప్రణాళికలపైనే ఎక్కువఅంచనాలు పెరుగుతున్నాయి. ముందు రోజు డాలరుతో రూపాయి మారకం విలువలు 20 పైసలు క్షీణించి 66.63రూపాయలుగా ఉంటేశుక్రవారం రూ.67.15లకు చేరుకున్నది.