రిస్క్‌ తక్కువనే షేర్ల విభజన ప్రతిపాదనలు!

6

రిస్క్‌ తక్కువనే షేర్ల విభజన ప్రతిపాదనలు!

ముంబై, అక్టోబరు 1: స్టాక్‌మార్కెట్లు భారీ స్థాయిలో నడుస్తున్నపుడు అత్యధికశాతం షేర్లు లాభాలతో దౌడు తీస్తున్నాయి. దీనితో షేర్లధరలు కొండెక్కుతా యి. ఇన్వెస్టర్లకు అక్కరకురానివిగా మారుతుంటా యి. దీనివల్లపెట్టుబడులు కూడా అంతంత మాత్రం గానే ఉంటాయి. ఈవిధానం నుంచి మార్చేందుకు ఎక్కువశాతం కంపెనీల ప్రమోటర్లు బోనస్‌షేర్లజారీ లేదా షేర్ల విభజనను ప్రకటిస్తారు. కంపెనీపై ఎలాంటి ప్రభావం పడకుండానే షేరుధర దిగి వస్తుంది. అంతేకాకుండా షేర్లసంఖ్య కూడా పెరిగి మరిన్ని షేర్లు అందుబాటులోనికి వస్తాయి. వాటా దారులకు మేలుచేకూర్చే చర్యలే కావడంతో ఇందు కు అభ్యంతరాలు కూడా పెద్దగా ఉండవు. అందు వల్లనే ఇటీవలి మారుతిసుజుకి వాటాదారులు కూడా షేర్ల విభజనకు డిమాండ్‌చేసారు. ఈ ఏడాది మార్చి నుంచి మారుతి 74శాతం ముందుకు దూకింది. రూ.5537 రూపాయలకు చేరింది. గతవారంలోనే 5630వద్ద నమోదయింది. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరంలో ఇప్పటికే 45 కంపెనీలు షేర్ల విభజనను చేపట్టాయంటే రిస్క్‌ తక్కువన్న భావనతోనే ముం దుకు వస్తున్నట్లు తెలుస్తోంది. కెపిఆర్‌మిల్‌, క్యాప్రి గ్లోబల్‌, కెఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఇదేబాటలో ఉన్నా యి. గతఏడాది ఆరునెలల్లోనే 48కంపెనీలు గరిష్టం గా షేర్ల విభజనను చేపట్టాయి. అత్యంత పనితీరును చూపిస్తున్న బజాజ్‌ఫైనాన్స్‌ షేరుధర 593గా ఉంది. 90శాతం దూసుకువెళ్లి తాజాగా 1106కు చేరింది. కంపెనీ యాజమాన్యం రూ.10 ముఖవిలువ ఉన్న షేరును రూ.రెండు ముఖవిలువ ఉన్న ఐదుషేర్లుగా విభజించేందుకు నిర్ణయించింది. ఒక్కోషేరుకు మరో షేరును ఉచితంగా జారీచేయాలని నిర్ణయించింది. కేవలం రెండునెలల్లోనే దేశంలో 27 కంపెనీలు షేర్ల విభజనకు ముందుకువచ్చాయి. గ్రాసిమ్‌, 8కెమైల్స్‌, కరూర్‌వైశ్యా తదితర బ్యాంకులున్నాయి. 2015 కేలం డర్‌ సంవత్సరంలో 68 కంపెనీలు షేర్ల ను విభజిస్తే 2016లో 65 కంపెనీలు షేర్ల విభజన చేపట్టాయి.

==============