రిలయన్స్‌ నుంచి కొత్తడిజైన్‌ ‘మిలాని’

RELIANCE
కాదంబ పుష్పాలు, స్వింగ్స్‌డిజైన్లలో మిలాని బ్రాండ్‌సరికొత్త ఆభరణాలను రిలయన్స్‌ జ్యుయెల్స్‌ ప్రవేశపెట్టింది.

రిలయన్స్‌ నుంచి కొత్తడిజైన్‌ ‘మిలాని’

 

హైదరాబాద్‌, జనవరి 13: కాదంబ పుష్పాలు, స్వింగ్స్‌డిజైన్లలో మిలాని బ్రాండ్‌సరికొత్త ఆభరణాలను రిలయన్స్‌ జ్యుయెల్స్‌ ప్రవేశపెట్టింది. డిజైనర్‌ గరిమా మహేశ్వరి రూపొందించిన ఈ కొత్త తరం ఆభర ణాలను రిలయన్స్‌బ్రాండ్‌ జ్యుయెల్స్‌ అందిస్తోంది. మిలాని అంటే గాలిమృధువుగా స్పృశించడం అని అర్ధం. ఆకర్షణీయ మైన పూల డిజైన్లతోప్రతి మహిళా వాటిని కోరుకుంటుందని, సమకాలీన, ఆధునిక వజ్రాభరణాల జ్యుయెలరీ డిజైన్స్‌, ఆధునికత ఉట్టిపడేలా బంగారంలో సాంప్రదాయ వారసత్వ డిజైన్లు పాశ్చాత్య దుస్తులకు సరిజోడుగా ఉంటాయని రిల యన్స్‌ జ్యుయెల్‌ ప్రకటించింది వజ్రాలతో పొదిగిన బంగారు నెక్లెస్‌, కదంబ పువ్వుల శ్రేణిలో రూపుదిద్దుకుంది. ఈ ఆధునిక అందమైన నెక్లెస్‌ సెట్‌ మ్యాచింగ్‌ ఇయర్‌ రింగ్స్‌తో లభిస్తుంది. ఇదే తరహాలో బ్రాస్‌లెట్లు, చేతిరింగులు కూడా ఈ కలెక్షన్‌లో ఉన్నట్లు రిలయన్స్‌ జ్యుయెల్స్‌ వివరించింది. అధునాతన డిజైన్‌ ఆభరణాలు కోరుకునేవారికి కొత్తగా వచ్చిన రిలయన్స్‌ మిలాని బ్రాండ్‌ ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని రిలయన్స్‌ ప్రకటించింది.
=========