రియాల్టీ రంగానికి ప్రత్యేక రాయితీలు

BASNSALI1

రియాల్టీ రంగానికి ప్రత్యేక రాయితీలు

హైదరాబాద్‌, జనవరి 26: కేంద్రప్రభుత్వం పక్కా గృహనిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధచూపిస్తున్నందున బడ్జెట్‌లో వరాలు చూపిస్తుందని అంచనావేసా రు. షెలట్రెక్స్‌ డెవలపర్స్‌ సిఇఒ సందీప్‌సింగ్‌ గౌర్‌. రెరాచట్టం, బినామీ లావాదేవీల నిషేధ చట్టం వంటివి రియాల్టీరంగానికి మరింత ఊతం ఇస్తాయన్నారు. అలాగే జిఎస్‌టి రేట్లపై మరింత స్పష్టత రావాలని ఆయన సూచించారు. జిఎస్‌టి రేట్లు రియాల్టీరంగానికి ఏశ్లాబ్‌ అమలవుతుందో చెప్పాలన్నారు. రిబేట్లు, పన్నులు మినహాయింపు వంటివి పక్కాగృహనిర్మాణరంగానికి అవసరం అవుతాయన్నారు. కార్పొరేట్‌ పన్నును మరింత గా తగ్గించడం స్వాగతించదగినదేనన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత గృహరుణాలపై మరింతగా రాయితీలు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. 2022 నాటికి అందరికీ పక్కాఇళ్లు కార్యాచరణ విజయవంతం కావాలంటే బడ్జెట్‌లో రంగానికి మరింతగా ప్రోత్సాహకాలు అవసరంఅని అన్నారు.