రిటైల్‌రంగానికి అత్యధిక ప్రాధాన్యం

IDBI
IDBI

రిటైల్‌రంగానికి అత్యధిక ప్రాధాన్యం

హైదరాబాద్‌, జూన్‌ 9: ఐడిబిఐ బ్యాంకు టర్నో వర్‌ వృద్ధికి గణనీయంగా కృషిచేస్తోందని, బ్యాంకు హైదరాబాద్‌జోన్‌ 13.7శాతం కస్టమర్లను పెంచుకోగలిగిందని బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి.సీతారాం పేర్కొన్నారు. బ్యాంకు కార్యకలాపాలను ఆయన మీడియాకు వివరిస్తూ ప్రస్తుతం కరెంటు ఖాతాలు, పొదుపుఖాతాల డిపాజిట్లు, రిటైల్‌ స్వల్పకాలిక డిపాజిట్లు 673.32కోట్లకు చేరాయని 43.4 శాతం వృద్ధిని సాధించామన్నారు అలాగే డిపాజిట్లపరంగా చూస్తే 391.56 కోట్లుగా ఉన్నాయని 25.20శాతంలక్ష్యాలు సాధించామన్నారు.

రిటైల్‌ రుణపోర్టుఫోలియో 6.10శాతం వృద్ధితోఉందన్నారు. బ్యాంకుతాజాగా కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోందని, రిటైల్‌ఫోర్టు ఫోలియోకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరించారు. గతఏడాది బ్యాంకు అనేక సవాళ్లు ఎదుర్కొన్నదని, రానున్న కాలం లో మరింతగా బిజినెస్‌ పోర్టుఫోలియో పెంచుకుంటుందన్నారు. బ్యాంకు ఇటీవలే రిటైల్‌ అడ్వాన్సులపరంగా 43శాతంపెరిగాయని, గతఏడాది 33శాతం మాత్రమేఉండగా ఈసారి పెరిగా యన్నారు. కాసా డిపాజిట్లు కూడా 22శాతంపెరిగినట్లు సీతారామ్‌ వివరించారు.

స్వల్పకాలిక డిపాజిట్లు కూడా 31శాతం నుంచి 32శాతానికిపెకరిగాయి. బ్యాంకు ఇటీవలేయుపిఐ యాప్‌ పేవిజ్‌, సోషల్‌ మీడియా బ్యాంకింగ్‌ ఫేస్‌బుక్‌ ఐఎంగేజ్‌ వంటివి ప్రవేశపెట్టామని సీతారామ్‌ వెల్లడించారు. కస్టమర్లకు డిజి టల్‌పాస్‌బుక్‌ ఎంపాస్‌బుక్‌ను ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌పై అందిస్తున్నట్లు వివరించారు. ప్రాధాన్యత లేని రంగా ల్లో బ్యాంకు తన నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకుంటుందని బ్యాంకు సిజిఎం బి.దాస్‌గుప్తా వెల్లడించారు. హైదరాబాద్‌ జోన్‌ కార్యకలాపాలు ఆశించినస్థాయిలో పెరిగాయని మరింత వృద్ధిని సాధిస్తామన్నారు.