రికార్డుస్థాయికి విదేశీ కరెన్సీ ఖజానా

Dollars
Dollars

రికార్డుస్థాయికి విదేశీ కరెన్సీ ఖజానా

ముంబయి,జూలై 3: దేశ విదేశీ కరెన్సీ రిజర్వులు రికార్డుస్థాయికి పెరిగాయి. 576.4 మిలియన్‌ డాలర్లు పెరిగి జీవిత కాల గరిష్టస్థాయి 382.53 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. విదేశీ కరెన్సీ ఆస్తులపరంగానే వృద్ధి నమోదయిందని ఆర్‌బిఐ వెల్లడించింది. అంతకు ముందు వారంలో ఈ నిల్వలు 799 మిలియన్‌ డాలర్లు పెరిగి 381.955 బిలియన్‌ డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తులరంగాలు చూస్తే 580.2 మిలియన్‌ డాలర్లు పెరిగి 358.664 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. డాలర్‌ కరెన్సీ ఆధా రంగా విదేశీ కరెన్సీల్లో ఉన్న హెచ్చుతగ్గుల విలువ లను విదేశీ కరెన్సీ ఆస్తులుగా పరిగణిస్తారు. యూరో, పౌండ్‌, యెన్‌ వంటి కరెన్సీల మార్పులే నిల్వలకు కీలకంఅవుతాయి.

బంగారంనిల్వల పరం గా చూస్తే స్థిరంగా 20.095 బిలియన్‌ డాలర్లవద్ద నే నిలిచాయి. ఇక ఐఎంఎఫ్‌వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ 1.5 మిలియన్‌ డాలర్లు క్షీణించి 1.467 బిలి యన్‌ డాలర్లకుచేరాయి. దేశరిజర్వుస్థాయి ఐఎంఎఫ్‌ వద్ద 2.3మిలియన్‌ డాలర్లు తగ్గి 2.303 బిలియన్‌ డాలర్లకు చేరింది. తాజాగా వివిధ దేశాల కరెన్సీ మార్పిడిరేట్లను చూస్తే డాలర్‌ 66.25రూపాయల వద్ద కొనుగోళ్లు, 62.95వద్ద మారకం జరిగింది. పౌండ్‌జిబిపి రూ.86వద్దకొనుగోళ్లు, రూ.81.75 వద్ద అమ్మకం, యూరోకరెన్సీ 75.55 కొను గోళ్లు, రూ.71.85 వద్ద అమ్మకాలు సాగాయి. ఇక స్విస్‌ఫ్రాంక్‌లు కొనుగోళ్లు 69.45, అమ్మకాలు 64.35లుగా ఉన్నాయి.

ఆస్ట్రేలియన్‌ డాలర్‌ రూ.51.20, రూ.48.15, కెనడా డాలర్‌ 51.30, రూ.48.25లు, సింగపూర్‌ డాలర్‌రూ.48.35, రూ.44.80చొప్పున కొనుగోళ్లు అమ్మకాలు సాగా యి. ఇక జపాన్‌యెన్‌ వందయెన్‌లు కలిపి భారతీ యకరెన్సీలో 60.20,రూ.55.90లుగా కొనుగోల్లు అమ్మకాలుసాగాయి. బహ్రెయిన్‌ దీనార్‌ పరంగా చూస్తే రూ.182.20, రూ.159.85 రూపాయలు గా మారకం సాగింది. కువైట్‌ దీనార్‌ కొనుగోళ్ల పరంగా రూ.219.15, రూ.176.65లుగా అమ్మకా లు సాగాయి. ఖతార్‌ రియాల్‌ రూ.18.40లు, రూ.15.85లు ఉన్నాయి. సౌదీ రియాల్‌ పరంగా చూస్తే రూ.18.30 కొనుగోళ్లు, రూ.16 అమ్మకాలు సాగాయి. దక్షిణాఫ్రికారాండ్‌రూ.5.35, రూ.4.45 చొప్పున క్రయవిక్రయాలు సాగినట్లు అంచనా.