రాష్ట్రాల ఆర్థికలోటు రూ.4.93 లక్షల కోట్లు!

fiscal
fiscal

రాష్ట్రాల ఆర్థికలోటు రూ.4.93 లక్షల కోట్లు!

న్యూఢిల్లీ,జూన్‌ 26: దేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థికలోటు అంతా కలిపితే దేశం మొత్తం మీద 4.93 లక్షలకోట్ల రూపాయలకు చేరింది. గతఏడాది ఉత్తరప్రదేశ్‌ ఆర్ధికలోటు రూ.64,320 కోట్లుగా ఉంది. అదే 1991లో కేవలం రూ.3070 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో చూపించిన ఆర్ధికలోటు 49,960 కోట్లుగా ఉంది. అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లోని ఆర్థికలోటు కూడా పెరుగుతూ వస్తోంది. మొత్తంగాచూస్తే 1991లో 18,790 కోట్లు ఉన్న ఆర్థికలోటు గత ఏడాది 4,93,360 కోట్లకు చేరింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై రిజర్వుబ్యాంకు విడుదలచేసిన కొత్త నివేదికల్లో ఈ అంశాలు ప్రస్ఫుటం అయ్యాయి. అంతేకాకుండా 2017 ఆర్ధిక సంవత్సరం నాటికి బడ్జెట్‌ అంచనాలు 4,49,520 కోట్లుగా ఉన్నట్లు అంచ నా. ఉత్తరప్రదేశ్‌ మరింతగా ఎక్కువ నమోదయింది.

రాజస్థాన్‌ 16 ఏళ్ల గణాం కాలను చూస్తే 1991లో 540కోట్లుగా ఉంది. ప్రస్తుతం గత ఏడాది 67,350 కోట్లకు చేరింది. 2017 ఆర్థికసంవత్సరంలో 40,530 కోట్లకు చేరుతుందని అంచనా. అలాగే మహారాష్ట్ర ఆర్థికలోటు 16 ఏళ్లక్రితం 1020 కోట్లుగా ఉంటే అదికాస్తా 37,950 కోట్లకు చేరింది. మరింతగా పెరిగి 35,030 కోట్లకు చేరుతుందని ఆర్‌బిఐ అంచనా వేసింది. ఇక గుజరాత్‌పరంగాచూస్తే సత్వర పారిశ్రామికీకరణకు పెట్టిందిపేరుగా నిలిచింది. చ16 ఏళ్లకాలంలో ఆర్థికలోటు రూ.1800 కోట్ల నుంచి 22,170 కోట్లకు పెరిగింది. అదికాస్తా రూ.24,610 కోట్లకు చేరుతుందని అంచనా. ఆర్థికలోటు తేడా రూ.70990 కోట్లుగా ఉంది. చ2010 నుంచి సుమారు రెట్టింపు అయి రూ.15,150 కోట్లకు చేరింది. 2015 నాటికి 18,320 కోట్లకు చేరినట్లు ఆర్‌బిఐ వెల్లడించింది. ఇక ఆంధ్ర ప్రదేశ్‌పరంగాచూస్తే 20,500 ఓట్లుగా ఉంది.

2016లో 17వేల కోట్లు లోటు ఉంటే 1991నాటి కాలంలో కేవలం రూ.970 కోట్లు మాత్రమే ఉంది. అదే విధంగా తమిళనాడుకు ఎక్కువ ఆర్ధికలోటు ఉంది. 1130 కోట్లనుంచి క్రమేపీ పెరిగి 32,320 కోట్లుగా ఉంది. ఇదికాస్తా 40,530 కోట్లకు చేరుతుందని అంచనా. కర్ణాటక రాష్ట్రపరంగా గతంలో మంచి ఆర్థికపరిపుష్టి ఉంది. రూ.560కోట్ల లోటు నుంచి 25,660కోట్లకు పెరిగింది. గతఏడాది 20,560 కోట్లుగాఉందని అంచనా. కేరళ రాష్ట్రపరంగాచూస్తే రూ.800 కోట్లనుంచి 17,720కోట్లకు పెరిగింది. అదికాస్తా 23,140 కోట్లకు చేరుతుందని అంచనా. శాంతిభద్రతలు మెరుగుపడినట్లుగా భావిస్తున్న బీహార్‌ రాష్ట్రంలో ఆర్థికలోటు 1590 కోట్లునుంచి క్రమేపీ పెరుగుతూ వచ్చి 28,510 కోట్లకు పెరిగింది. 2017లో 16,010కోట్లకు తగ్గుతుందని అంచనా. పశ్చిమబెంగాల్‌పరంగా చూస్తే ఎక్కువ రుణాలున్నాయి.

ఆర్థికలోటు 1630కోట్లనుంచి 25,180కోట్లకు పెరిగింది. క్రమేపీ క్రమశిక్షణతో 19,360కోట్లకు రావచ్చని అంచనావేసింది. సామాజిక భౌగో ళిక పరిస్థితులు, రాష్ట్రస్థూల ఉత్పత్తి, వ్యవసాయం, పారిశ్రామికరంగం, మౌలిక వనరులు, బ్యాంకింగ్‌, ఆర్థిక సూచీల సమాచారంతో 1950-51నుంచి 2016-17 వరకూ ఆర్థికనివేదికలను ఆర్‌బిఐ ప్రకటించింది. అలాగే రాష్ట్రాల వారీగా తలసరి విద్యుత్‌ వినియోగం, మొత్తం అందుబాటులో ఉన్న విద్యుత్‌ వనరులు, ఉత్పత్తి సామర్ధ్యం, విద్యుత్‌ అవసరాలు, జాతీయ రహదారుల పొడవు, రోడ్లు, రాష్ట్ర హైవేలు, రైల్వేలైన్ల వివరాలను కూడా పొందుపరిచింది.