రాష్ట్రాలకు రూ.450 బిలియన్‌ల రాబడులు

dollar
dollar

రాష్ట్రాలకు రూ.450 బిలియన్‌ల రాబడులు

న్యూఢిల్లీ, మే 31: జిఎస్‌టి అమలు తర్వాత 2017 మధ్యకాలం నుంచి రాష్ట్రాలకు 350 నుంచి 450 బిలియన్‌ రూపాయలవరకూ ఆదాయం పెరుగుతుందని అంతర్జాతీయ సర్వేసంస్థ స్టాండర్డ్‌ చార్డర్డ్‌ నివేదిక వెల్లడించింది. బ్యాంకు ఇండియా రాష్ట్రాల ఆర్థికవనరులు అన్న శీర్షికతో విడుదలచేసిన పుస్తకం లో జిఎస్‌టి అమలు తర్వాత రాష్ట్రాలకు మొత్తంగా 350 నుంచి 450 బిలియన్‌ రూపాయలకు చేరు తుందని అంచనావేసింది. వివిధ రాస్ట్రాలకు రానున్న దశాబ్దకాలంలో ఎదురయ్యే పరిస్థితుల ను అంచనావేసింది. తమతమ ఆర్ధికలోటును బడ్జెట్‌ లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పాటుచేసు కున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు భర్తీ చేస్తుందని,కేంద్ర రాష్ట్రాల ఆర్థికలోటు జిడిపిలో 3.2శాతానికి మించకుండా చూస్తే కేంద్ర రాష్ట్రా ల మొత్తం లోటు ఆరుశాతానికి మించకుండా ఉంటుందని స్టాండర్డ్‌ చార్డర్డ్‌ అంచనావేసింది. 18 రాష్ట్రాలను సంస్థ అధ్యయనంలో పరిశీలిం చింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో లోటు స్థిరంగా ఉన్నట్లు అంచనావేసింది.

2016-17 ఆర్థిక సంవత్సరంలో 2.7శాతంగా ఉందని అంచనా. అయితే ఉద§్‌ు ప్రభావాన్ని వీటినుంచి మినహా యించింది. ఉద§్‌ు బాండ్ల జారీకారణంగా అదనపు వడ్డీ చెల్లింపులు చేయాల్సి ఉంటుందని, ఈ దృష్ట్యా జిడిపిలో 0.1శాతం అదనంగా కోల్పోవాల్సి ఉంటుందని అంచనా వేసింది. అంతేకాకుండా ఎక్కువ రాష్ట్రాలు వేతన కమిటీ సిఫారసులు, రుణమాఫీ భారం వంటివాటిపై ఎక్కువ కసరత్తులుచేస్తున్నాయి. ఎక్కువ రాష్ట్రాలు మధ్యస్తంనుంచే వేతన సవరణలను పెంపును అమలుచేస్తుండటంతో సమస్యలు కొంత పరిమితంగానే ఉంటుందని అంచనావేస్తోంది. ఆర్థికలోటుపై ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కొంత ప్రభావం చూపిస్తున్నా సునాయాసంగా అధిగమించే వీలుంటుందని, జిఎస్‌టిని జూలై నుంచే అమలు చేస్తున్నందున ఎక్కువ రాష్ట్రాలకు రాబడులు సైతం పెరుగుతాయని అంచనావేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు రాబడినష్టాన్ని ఐదేళ్ల వరకూ భర్తీచేసేందుకు ముందుకువచ్చిన సంగతి తెలిసిందే.