రానిబాకీల రికవరీ కష్టమేమీకాదు!

ARUNDATI11
ARUNDATI

రానిబాకీల రికవరీ కష్టమేమీకాదు!

యోకహామా(జపాన్‌), మే 7: భారత్‌లో రానిబాకీ లు ఎక్కువగా పరిశ్రమలరంగానికి సంబంధించి మాత్రమే ఉన్నాయని, వృద్ధి రికవరీ కాగానే వీటిని వసూలు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని భారతీ య స్టేట్‌బ్యాంకు ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య అన్నారు. దేశంలో ఎక్కువశాతం రానిబాకీలన్నీ కూడా పరిశ్రమల రంగంలోనే ఉన్నాయని ఇప్పటికీ అవి బిజినెస్‌ చేస్తున్నందున బ్యాంకుల రికవరీకి ఆస్కారం ఉందని ఆమె అన్నారు. ఆసియా బ్యాంకింగ్‌ సవాళ్ల సమయం అన్న అంశంపై జరిగిన సదస్సులో ఎస్‌బిఐ సిఎండి మాట్లాడారు. ప్రస్తుతం రానిబాకీలుగా మారడానికి ఎక్కువశాతం రుణాల్లో మరింతగా నగదును సాధించలేకోతున్నాయని దీనివల్ల వారి అప్పులపై వడ్డీకూడా రానివిధంగా రికవరీ ఉంద న్నారు. నిర్వహణ భారం, వ్యయం పెరగడం వంటివి కొన్ని కీలక అంశాలుగా చెప్పారు. మొత్తం రుణాల్లో 6.6శాతం కార్పొరేట్లకు కేటాయించినవి రానిబాకీలుగా లేదా నిరర్ధక ఆస్తులుగా ప్రకటించారని క్రెడిట్‌స్యూస్సీ అంతర్జాతీయసంస్థ వెల్లడించింది. జిడిపిలో వీటి మొత్తం వాటా 8.4శాతంగా ఉంటుందని ప్రకటిం చింది. బ్యాంకులు మొత్తంగాచూస్తే 9 నుంచి 12 లక్షలకోట్ల రూపాయల సమస్యాత్మక బాకీలు ఉన్నాయని రానిబాకీలు, పునర్‌వ్యవస్థీకరించిన రుణాలు, కంపెనీలకిచ్చిన అడ్వాన్సులు వంటివి ఎక్కువ ఉన్నాయి. వనరులు వృధా కాకుండా ఈ రానిబాకీల సమస్యను ఎలా పరిష్కరించాలా అన్నదే ప్రస్తుత ఆర్థికవ్యవస్థలో సవాల్‌గా నిలిచిందన్నారు. భారతీయ బ్యాంకింగ్‌ రంగంలో ఎక్కువగా కార్పొరేట్‌ రుణభారమే అధికంగా ఉందని, వీటికితోడు సంక్లిష్ట చట్ట పరమైన నిబందనలు కూడా రికవరీకి కొంత ఆటంకం ఇస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తు తం ఆర్థికవృద్ధి సాగుతోందని, దీన్నిబట్టి పారిశ్రామికరంగంలో పురోగతి కనిపిస్తున్నందున రానిబాకీల సమస్యను పరిష్కరించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భట్టాచార్య వెల్లడించారు.