యువపారిశ్రామికవేత్తలకు ఫిక్కీలేడీస్‌ పునశ్చరణ

FICCI
FICCI

హైదరాబాద్‌: ఔత్సాహిక వ్యాపార వేత్తలు,పారిశ్రామికవేత్తలు,యువకులకు వ్యాపార అనుభవాలు, ఎదురయ్యే సవాళ్లపై సోదాహరణంగా వివరించేందుకు ఫిక్కీలేడీస్‌ ఆర్గనైజేషన్‌ పలువురు సీనియర్‌ పారిశ్రామికవేత్తలు,యువ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే హెరిటేజ్‌ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారాబ్రాహ్మణి, రాష్ట్ర పంచాయితీరాజ్‌ ఐటి శాఖల మంత్రి నారాలోకేష్‌లతో కలిసి కార్యగోష్టిని నిర్వహించింది. సుమారు 150మందికిపైగా ఫిక్కీలేడీస్‌ సభ్యులు హాజరైన ఈ సదస్సుకు విశేష స్పందన లభించింది. వ్యాపారం, రాజకీయాల్లో వారి అనుభవాలు, నైపుణ్యాలను స్వయంగా విని తెలుసుకునేందుకు ఎక్కువ మంది సభ్యులు హాజరయ్యారు. థింకింగ్‌ రిఫ్రెష్డ్‌ సందేశంతో ఈ కార్యగోష్టిని ఏర్పాటుచేసామని ఫిక్కీలేడీస్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌పర్సన్‌ కామిని షరాఫ్‌ పేర్కొన్నారు. 25ఏళ్ల చరిత్రకలిగిన
హెరిటేజ్‌గ్రూప్‌ను నారాబ్రాహ్మణిఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తున్నారు. స్టాన్‌ఫోర్టు వర్సిటీలో
ఎంబిఎ పట్టాపొందిన లోకేష్‌ అటు వ్యాపారపరంగాను, రాజకీయంగా కూడా యువకులకు స్ఫూర్తిగా నిలిచారని ఫిక్కీలేడీస్‌
ప్రశంసించింది. భార్యాభర్తలిద్దరూ కూడా స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీనుంచి వచ్చిన విద్యార్ధులే కావడం, ఇద్దరి అభిప్రాయాలు ఒకేతీరుతో
ఉండటంవల్లనే వారి ఆధ్వర్యంలో ఇటు వ్యాపారం, అటు రాజకీయాల్లో కూడా మరింత వృద్ధిచెందుతున్నట్లు ఫిక్కీలేడీస్‌ అభివర్ణించింది.