మ‌రో బ్యాంక్ కుంభ‌కోణం..

IDBI
IDBI

చెన్నై: ఐడీబీఐ బ్యాంకులో సుమారు రూ. 772 కోట్ల మోసం జరిగినట్లు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లోని అయిదు బ్రాంచీల్లో ఈ మేరకు అక్రమంగా రుణాలను మంజూరీ చేసినట్లు నిర్ధారించారు. 2009 నుంచి 2013 మధ్యకాలంలో ఈ మొత్తాన్ని మత్స్య వ్యాపారులకు అందజేశారు. కొందరు పారిశ్రామికవేత్తలు 772 కోట్ల రుణాలను క్రమంగా తీసుకున్నారని బ్యాంక్ ఆరోపించింది. చేప చెరువుల పేర్లతో ఈ రుణాలను తీసుకున్నారు. న‌కిలీ ద‌స్తావేజుల‌ను సృష్టించి, రుణాలను తీసుకున్నట్లు బ్యాంక్ పేర్కొన్నది. కొన్ని అకౌంట్ల నుంచి రికవరీ చేసినా.. చాలా వరకు అకౌంట్లు ఎన్‌పీఏ కింద ఉండిపోయాయని బ్యాంక్ వెల్లడించింది. రుణాల పరిశీలన, వితరణలో చాలా లోపులు ఉన్నట్లు బ్యాంక్ గుర్తించింది. రుణాల ఎగవేత కింద సీబీఐ వద్ద అయిదు ఫిర్యాదులను నమోదు చేసినట్లు ఐడీబీఐ బ్యాంక్ వెల్లడించింది.