మ‌ద్ద‌తు ధ‌ర‌తో పుంజుకున్న మార్కెట్లు

stock exchange
stock exchange

ముంబైః మదుపర్ల అప్రమత్తతో ఈ ఉదయం సెన్సెక్స్‌ 30 పాయింట్ల స్వల్ప నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. అయితే కాసేపటికే లాభాల బాట పట్టినప్పటికీ చాలా సేపటి వరకు ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఆ తర్వాత కొనుగోళ్లు వెల్లువెత్తడంతో పుంజుకున్న సూచీ ఇక వెనుదిరిగి చూడలేదు. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 267 పాయింట్ల ఎగబాకి 35,645 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 70 పాయింట్ల లాభంతో 10,770 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.71గా కొనసాగుతోంది.