మూతపడిన రొటోమాక్‌

ROTOMAC-1
ROTOMAC-1

మూతపడిన రొటోమాక్‌

ముంబై, మార్చి 11: రొటొమాక్స్‌ సంస్థలు మూతపడబోతున్నాయి. బ్యాంకులకు దాదాపు రూ.4000కోట్లు బకాయి పడిన రెండు రొటొమాక్‌ గ్రూపు కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన సమయం ముగియడంతో, ప్రస్తుతం ఆ కంపెనీలను దివాలా కోర్టు వేలం వేయబోతుంది. రొటొమ్యాక్‌ గ్రూపు కంపెనీలు 90రోజుల అదనపు సమయం కోరగా, మరింత సమయం ఇచ్చేందుకు బ్యాంకులు తిరస్కరించాయి. ముందస్తు ఇచ్చినడెడ్‌లైన్‌ మార్చి 19తో ముగియబోతుంది.

దీంతో విక్రమ్‌ కొఠారికి చెందిన రొటొ మ్యాక్‌ ఎక్స్‌పోర్ట్స్‌, రొటొమ్యాక్‌ గ్లోబల్‌ సంస్థలను దివాలా కోర్టువేలం వేయబోతున్నట్లు తెలిసింది. మరో రెజుల్యూషన్‌ ప్లాన్‌ లేకపోవడంతో, ఈ నిర్ణ యం తీసుకున్నట్లు వెల్లడైంది. రొటొమ్యాక్‌ కంపెనీల రెజుల్యూ షన్‌ ప్రొఫిషనల్‌ అనిల్‌ గోయల్‌ ఈ విషయాన్ని ధృవీకరించారు. బ్యాంకులు ముందస్తు ఇచ్చిన గడువును పొడిగించడానికి తిర స్కరించినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం తుది గడువు పొడి గింపుపై ఓటింగ్‌ కోసం సమావేశమైన క్రెడిటార్ల కమిటీ, ఈ సందర్భంగా ఏక గ్రీవంగా నిర్ణ యం తీసుకున్నట్లు ఓ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. కొన్ని రోజుల క్రితమే రుణాల డిఫాల్ట్‌ కేసులో రొటొమ్యాక్‌ యజమాని విక్రమ్‌ కొఠారి, ఆయన కుమా రుడు రాహుల్‌ కొఠారిలను సిబిఐ అరెస్ట్‌ చేసింది.

వీరు విచారణకు సహకరిం చకపోవడంతోనే, అరెస్ట్‌చేసినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. బ్యాంకు ఆఫ్‌ఇండియా, బ్యాంకు ఆఫ్‌బరోడా, ఓరియంటల్‌బ్యాకు ఆఫ్‌ కామర్స్‌, అలహాబాద్‌బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్రలకు రొటొమ్యాక్‌ గ్రూపు కంపెనీలు దాదాపు రూ.4000కోట్లు బకాయి పడిన సంగ తి తెలిసిందే. భారీస్థాయిలో రుణా లు తీసుకుని స్వప్రయోజనాల కోసం దారి మళ్లించినట్లు సిబిఐ గుర్తించింది.

బ్యాంకు ఆఫ్‌ బరో డా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొఠారిపై సిబిఐ తొలుత ఈ కేసు నమోదుచేసింది. రొటొ మ్యాక్‌ సంస్థలకు బ్యాంకు ఆఫ్‌ఇండియా రూ.754.77 కోట్లు, బ్యాంకు ఆఫ్‌ బరోడా రూ.456.63కోట్లు, ఇండి యన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు 771.07కోట్లు, యూని యన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండి యా రూ.458.95కోట్లు, అలహాబాద్‌ బ్యాంకు రూ.330.68కోట్లు, బ్యాంకు ఆఫ్‌మహారాష్ట్ర రూ.49.82కోట్లు, ఓరియంటల్‌ బ్యాం కు ఆఫ్‌ కామర్స్‌ రూ.97.47 కోట్ల రుణాలిచ్చాయి.