మూడో విడత 23 బ్లాక్‌ల వేలం

oil
oil

700 మిలియన్‌ డాలర్ల రాబడి లక్ష్యం
న్యూఢిల్లీ: భారత్‌ మూడోవిడత బిడ్డింగ్‌లో 23 చమురు,గ్యాస్‌ క్షేత్రాలను వేలం వేస్తోంది. రాబడులు 700 మిలియన్‌ డాలర్లవరకూ రావచ్చని అంచనావేసింది. తాజాగా ఒఎఎల్‌పి ఈ వేలం పాటలద్వారా 700 మిలియన్‌ డాలర్లు రాబట్టవచ్చని అంచనావేసింది. 23 బ్లాక్‌లు మొత్తం 12 బేసిన్‌లలో ఉన్నాయి. ఓపెన్‌ ఏకరేజి లైసెసెప్నింగ్‌ పాలసీ కింద 13వ విడత పెట్రోటెక్‌2019లో వీటిని వేలం వేస్తుందని అంచనా. ఇతరత్రా 23 బ్లాక్‌లు 12 బేసిన్‌లలో ఉన్నాయి. వీటిలో 19 ఆన్‌ల్యాండ్‌ క్షేత్రాలు, ఐదు బొగ్గు మిథేన్‌ క్షేత్రాలు, మూడు నదీజలాల్లోని క్షేత్రాలు, ఒకటి లోతైన జలాల్లో ఉన్న క్షేత్రాన్నివేలం వేస్తున్నారు. మొత్తం ఈటిని తవ్వకాలద్వారా మూడులక్షల చదరపు కిలోమీటర్లమేర ఉంటుందనిచ2019 చివరినాటికి వీటినిఉత్పత్తి జరుగుతుందని అంచనావేసారు. ఒఎఎల్‌పి తాజా వేలంద్వారా భారీ రాబడులు ఆశిస్తోంది.2022 నాటికి ప్రస్తుతం ఉన్న 80శాతం దిగుమతులను 67శాతానికి తగ్గించుకునేలక్ష్యంతో హైడ్రోకార్బన్‌లపై గురిపెట్టింది. విదేశీ భాగస్వాములనుసైతం కలుపుకుని దేశీయ కంపెనీలు నిక్షేపాలను వెలికితీస్తున్నాయి. వేలం తర్వాత బిడ్డర్లు ఎన్‌డిఆర్‌లో ఉన్నగణాంకాల ఆధారంగా అన్వేషణచేస్తారు. ఆన్‌లైన్‌ ఇ బిడ్డింగ్‌ పోర్టల్‌ద్వారా వేలంలో పాల్గొనవచ్చు.సోమవారం నుంచి ఈ వేలం దరఖాస్తులుప్రారంబం అవుతునానయి. మూడోవిడత బిడ్డింగ్‌ను వచ్చే ఏప్రిల్‌ పదవ తేదీతో ముగుస్తాయి. హెల్ప్‌, ఒఎఎల్‌పి సంస్థలద్వారా ప్రభుత్వం వద్ద ఉన్న జాతీయ డిపాజిటరీ గణాంకాలను పరిగణనలోనికి తసీఉకుని పెట్రోలియం సహజవాయు మంత్రిత్వశాఖ ఈ వేలం పాటలువేసింది. ఏకరేజి సుమారు 90వేల చదరపు కిలోమీటర్లమర ఉంది. తర్వాత 1.50 లక్షల చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. ఒఎఎల్‌పి ఒకటోదశకింద 2,10లక్షల చదరపు కిలోమీటర్లు, రెండోవిడత మూడోవిడత బిడ్డింగఖలకోసం మూడులక్షల చదరపు కిలోమీటర్లను సిద్ధంచేస్తున్నారు. మూడోవిడత మేనెలలో జరుగుతుంది. ప్రభుత్వం సుమారు 40వేల కోట్ల పెట్టుబడులను ఈ 14 బ్లాక్‌లలో రాబట్టేందుకు నిర్ణయించింది. 14 బ్లాక్‌లలు ఒఎఎల్‌పి రెండోవిడతలో 29,333 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నాయి. గత ఏడాది ఒఎఎల్‌పి 60వేల కోట్ల రాబడులను తీసుకురావాలని నిర్ణయించారు. మొత్తం 55 క్షేత్రాల్లో ఈ వేలం పాటలు జరిగాయి.