మాల్యాకు మరో షాక్‌

Vijay Malya
Vijay Malya

లండన్‌: ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తిరుగుతున్న లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌, లండన్‌లో కొన్ని న్యాయ కేసులను ఎదుర్కొంటున్న మాల్యా, భారతీయ బ్యాంకుల (పెట్టుబడిదారులసహ వ్యవస్థకు) కన్సోర్టియం లీగల్‌ ఫీజుల కింద రూ.1.5 కోట్లను చెల్లించాలని లండన్‌ హైకోర్టు ఆదేశించింది. బ్యాంకులకు విరుద్ధంగా మాల్యా పెట్టిన కేసు కొట్టివేసిన తర్వాత వారి లీగర్‌ ఫీజులు వారికి చెల్లించాలని తెలిపింది. అయితే భారతీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజ§్‌ుమాల్యాను ప్రస్తుతం భారత్‌కు అప్పగించే క్రమంలో లండన్‌ కోర్టులో విచారణ జరుగుతుంది. ఇప్పటికే లీగల్‌ ఫీజుల కింద రూ.1.8కోట్లను మాల్యా చెల్లించారు. తాజాగా మరో రూ.1.5కోట్లను ఇవ్వాల్సి ఉంది. ఈ కేసులో మొత్తం బ్యాంకులకు రూ.3.3కోట్లను మాల్యా చెల్లిస్తున్నారు. బ్యాంకుల న్యాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని తొలి ప్రతివాది మాల్యా 2,00,000 పౌండ్లు అంటే రూ.1.8కోట్లు చెల్లింపులు చేశారు. రెండు నెలల లోపు మరో 1,75,000 పౌండ్లను చెల్లించి, ఆఖరి పరిష్కారం పొందుతారు అని జడ్జి వాక్స్‌మాన్‌ క్యూసీ చెప్పారు. ప్రస్తుతం అతను బ్యాకులతో రాజీకి వస్తున్నారని తెలిసింది. కాగా, జూలై నెలాఖరిన విజ§్‌ు మాల్యాను భారత్‌కు అప్పగింతంపై ఆఖరి విచారణ జరిగింది. బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, తనపై వస్తున్న మనీలాండరింగ్‌ ఆరోపణల్లో నిజంలేదని మాల్యా వివరించారు.