మార్కెట్‌కు టివిఎస్‌ ఎస్‌టార్క్‌

TVS
TVS

హైదరాబాద్‌: రేసింగ్‌ స్పీడ్‌తో వెళ్లాలనుకునే మోటారుప్రియులకోసం టివిఎస్‌ కొత్తగా ఎస్‌టార్క్‌ 125 సిసి స్కూటర్‌ను మార్కెట్‌కు విడుదలచేసింది. ఆధునిక సివిటిఐ ఆర్‌ఇవివి 3వాల్వ్‌ ఇంజన్‌తో ఈ స్కూటర్‌ వస్తోంది. టివిఎస్‌ స్మార్ట్‌ఎక్సోనెక్ట్‌తో అనుసంధానించినట్లు కంపెనీ మార్కెటింగ్‌ ఉపాధ్యక్షుడు అనిరుద్ధహల్దార్‌ వెల్లడించారు. బ్లూటూత్‌ ఆధారిత స్కూటర్‌, సెల్‌ఫోన్‌ కనెక్టివిటీ, నేవిఏగేషన్‌ అసిస్టెన్స్‌, మల్టీమోడ్స్‌ స్ట్రీట్‌ స్పోఱ్ట, రైడ్‌ స్టాటస్‌, ఇన్‌బిల్ట్‌లాప్‌ టైమర్‌, ఇంజన్‌ ఆయిల్‌ ఉష్ణోగ్రత డిస్‌ప్లే, స్పీడోమీటర్‌, టాప్‌స్పీడ్‌ రికార్డరు వంటివి ఉన్నాయి. గంటకు 95 కిలోమీటర్ల గరిష్టవేగం ఇస్తుంది. ఇపుడు మాట్టేగ్రీన్‌, మాట్టెరెడ్‌, మాట్టెవైట్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. హైదరాబాద్‌ ఎక్స్‌షోరూంధరగా రూ.61,450గా నిర్ణయించారు.