మార్కెట్లోకి స్విఫ్ట్‌ డిజైర్‌

brk
Swift dezire

మార్కెట్లోకి స్విఫ్ట్‌ డిజైర్‌

న్యూఢిల్లీ, మే 17: మారుతిసుజుకీలో అత్యంత విజయ వంతమైన సిఫ్ట్‌ డిజైర్‌ మోడల్‌ను సరికొత్త హంగుల తో మార్కెట్లోకి విడుదల చేశారు. డిజైర్‌ సిరీస్‌లో ఇది మూడో తరం కారు. కాంపాక్ట్‌ సెడాన్‌ విభాగంలో ఇప్పటికే స్విఫ్ట్‌ డిజైర్‌ షేరు 50శాతం పైమాటే. కొత్త మోడల్‌లో మార్కెట్‌వాటా మరింత పెరుగుతుందని మారుతిసుజుకి భావిస్తోంది. కొత్త డిజైర్‌ను ఏకేఏ సుజుకీ బీ ప్లాట్‌ఫామ్‌పై తయారుచేస్తున్నారు. ఇప్ప టికే బాలినోను కూడా దీనిపై తయారు చేస్తున్నారు. దీని ప్రారంభ మోడల్‌ ధర రూ.5,45,000లక్షలు. కాగా టాప్‌ వేరియంట్‌ అయిన జడ్‌డిఐ ప్లస్‌ ఎజిఎస్‌ మోడల్‌ ధర రూ.9,41,000లక్షలు. దీనిని రూ.33వేలు చెల్లించి మారుతి డీలర్స్‌ వద్ద బుక్‌ చేసుకోవచ్చు. మే తొలివారం నుంచి బుకింగ్స్‌ స్వీకరిస్తున్నారు. కారు అందటానికి దాదాపు 8వారాలు సమయం పట్టవచ్చు. ఈసారి కొత్తగా మూడు రంగుల్లో డిజైర్‌ అందుబాటులోకి వచ్చింది. ఆక్స్‌ఫర్డ్‌ బ్లూ, గాలెంట్‌ రెడ్‌, షీర్‌వుడ్‌ బ్రౌన్‌ రంగుల్లో లభిస్తుంది. పెట్రోల్‌ వేరియంట్‌ బరువు 85 కిలోలు తగ్గగా, డీజిల్‌ వేరియంట్‌ బరువు 105 కిలోల వరకు తగ్గింది. కొత్త డిజైర్‌ అభివృద్ధికి మారుతి రూ.1,000కోట్లు వెచ్చించింది. ఇది 3,95ఎంఎం పొడవు కలిగి ఉంటుంది. 1.2లీటర్‌ వివిటి (పెట్రోల్‌), 1.3లీటర్‌ డిడిఐఎస్‌(డీజిల్‌). ఈ రెండు ఇంజిన్లలో ఆటోగేర్‌ ఆప్షన్‌ను మారుతి ఇచ్చింది.