మార్కెట్లకు రుచించని బ్యాంకుల విలీనం

Banks
Banks

మార్కెట్లకు రుచించని బ్యాంకుల విలీనం

ముంబయి, జూన్‌ 16: బ్యాంకింగ్‌రంగంలో పేరుకుని పోతున్న ఎన్‌పిఎల పరిష్కారానికి రిజర్వుబ్యాంకు విస్తృత అధికారాలు దాఖలుపరచడం, రానిబాకీల పైనా, ఉద్దేశ్యపూర్వక ఎగవేత దారులపైనా దివాళా చట్టం ప్రయోగించి రికవరీచేయడం వంటి వాటితో పాటు చిన్న బ్యాంకులను విలీనం చేయడం ద్వారా బ్యాింంగ్‌రంగంలో పునరేకీకరణకు కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ముందుకువచ్చింది. భారతీయ స్టేట్‌బ్యాంకు అనుబంధ బ్యాంకులను విలీనంచేసిన ప్రక్రియ తరహాలోనే దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మరికొన్నింటిని విలీనంచేసేందుకు సిద్ధం అవుతోంది. చిన్నబ్యాంకులు దేనాబ్యాంకు, విజయా బ్యాంకు, యూకోబ్యాంకు, యూనియన్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ఇండియా, కెనరా బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలను విలీనం చేసేందు కు ఆర్థికశాఖ సిద్ధం అవుతోంది.

మార్కెట్లపరంగా ఈ విలీనం సమాచారానికి ఆశించిన స్థాయిలో స్పం దన రాలేదనే తెలుస్తోంది. కెనరాబ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు ఒకటిశాతం చొప్పున ఎన్‌ఎస్‌ఇ లో క్షీణించాయి. ఇంట్రాడే డీల్స్‌లో రూ.353, రూ.171వద్ద నడిచాయి. ఇతరత్రాచూస్తే ఇతర చిన్న బ్యాంకులు 1-3శాతంమధ్యలోనే దిగువన ట్రేడింగ్‌ ముగించాయి. నిఫ్టీ బ్యాంక్‌ సూచి నిఫ్టీ 50సూచీలు 0.5శాతం, 0.3శాతం చొప్పున దిగజారాయి. ప్రస్తుతం పెరిగిపోయిన రానిబాకీలు, మొండి బకాయిల దృష్ట్యా ప్రభుత్వరంగ బ్యాంకు ల్లో ఎక్కువ కొనుగోళ్లు చేయవద్దని కూడా ఇన్వెస్టర్లకు బ్రోకింగ్‌ సంస్థలు సూచిస్తున్నాయి. విలీనానికి సంబం ధించి మరికొంత స్పష్టత వచ్చేంత వరకూ వీటిజోలికి వెళ్లకపోవడమే మంచిదని చెపుతున్నారు. ఆర్‌బిఐకి విస్తృతఅధికారాలు ఇవ్వడం ద్వారా ఎన్‌పిఎలకు పరిష్కారం లభి స్తుందని అంచ నా వేస్తున్నారు.

గడచిన కొన్ని నెలలుగా ఈ వార్తలతోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు పెరిగాయి. ప్రస్తుత స్థాయిని పరిశీలిస్తే ఈస్టాక్స్‌లో కొనుగోళ్లు శ్రేయస్క రంకాదని బ్రోకర్లు హెచ్చరిస్తున్నారు. బిజినెస్‌ వాతా వరణం సజావుగాలేదని బ్యాంకుల్లో రుణాలవృద్ధి కూడా ఆశించిన స్థాయిలో లేదని ఎస్‌ఎంసి గ్లోబల్‌ ఉపా ధ్యక్షుడు సౌరభ్‌జైన్‌ అన్నారు. ఎన్‌పిఎలకు పరిష్కారం హడావుడిగా జర గదని ప్రభుత్వం ఈబ్యాంకు లను వాటి సామర్ధ్యం ఆధారంగా ఎంచు కుని చిన్నసైజు బ్యాంకులను విలీనం చేయా లని చూస్తోంద న్నారు.ఈ ఎంపిక చేసిన బ్యాంకు ల ఆస్తిఅప్పుల పట్టీలుఇప్పటికే దిగ జారాయి. ఈ బ్యాం కుల్లోఇప్పటికే పెట్టుబడు లు పెట్టిన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థలు కూడా ఇదే సూచిస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాం కులకంటే ప్రైవేటురంగ బ్యాంకులు శ్రేయస్కరమని వారు చెపుతున్నారు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో చిన్న బ్యాంకులు విలీనం అయితే మరింతగా బ్యాంకు ఆస్తిఅప్పుల పట్టీ దిగజారుతుందని అంచనా. అందువల్ల పిఎస్‌యు బ్యాంకుల షేర్లు కొనుగోలు చేయమని సిఫారసు చేయలేమని ఏంజెల్‌ బ్రోకింగ్‌ సీనియర్‌ ఈక్విటీ రీసెర్చి హెడ్‌ సిద్ధార్ధ్‌ పురోహిత్‌ వెల్లడించారు. కెనరాబ్యాంకుపరంగా కొంత ఆశాజనకమేనని ఎన్‌పిఎలపరంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కంటే తక్కువగానే ఉన్నాయని బ్రోకింగ్‌సంస్తలు చెపుతు న్నాయి. ఏదిఏమైనా ఎన్‌పిఎల సమస్యలు సమూ లంగా పరిష్కారం అయితేనే ప్రభుత్వరంగ బ్యాంకుల స్టాక్‌ కొనుగోలు మంచిదని బ్రోకింగ్‌ సంస్థలు సూచిస్తున్నాయి. ఇక రెండోవిడత విలీనం పరంగా కెనరాబ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలలో ఎక్కువ బ్యాంకులు విలీనాలు కావచ్చని ప్రభుత్వ పరంగా సంకేతాలు అందుతున్నాయి. ప్రభుత్వం రెండోవిడత విలీనాల పరంగా ఆరేడు బ్యాంకులతో విలీనాలపై సంప్ర దింపులు జరుపుతోంది. వచ్చే రెండు నెలల్లోనే ఈ విలీనం ప్రక్రియ తెరపైకి రావ చ్చన్న వార్తలతో బ్యాంకింగ్‌షేర్లు ఊపందుకుంటా యని భావించిన ఇన్వెస్టర్లకు నిరాశే ఎదురయింది.