మారుతీ కార్లపై ఐదేళ్ల వారంటీ

MARUTI
MARUTI

మారుతీ కార్లపై ఐదేళ్ల వారంటీ

ముంబయి,నవంబరు6: మారుతీ సుజుకి వినియోగదారులకు భారీ ఆఫర్‌ను ప్రకటిం చింది. వారెంటీని ఐదేళ్ల వరకు పెంచుకునే అవకాశం కల్పించింది.ఈ ఆఫర్‌కు ‘ఫరెవర్‌ యువర్స్‌ ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ ఆఫర్‌ అని పేరు పెట్టింది.నెక్సాలో విక్రయించే మోడల్స్‌కు మాత్రం ఈ ఆఫర్‌ వర్తించదని కంపెనీ తెలిపింది.సాధారణంగా మారుతీ కార్లపై 2 ఏళ్లు కానీ,40వేల కిలోమీటర్ల వరకు కానీ వారెంటీ ఉంటుంది.ఈ వారెంటీ వల్ల మారుతీ సర్వీస్‌ ఎక్స్‌పీరియన్స్‌ నాణత్య పెరగడంతో పాటు వాహన యజమానులకు ఖర్చు తగ్గుతుందని మారుతీ పేర్కొంది.ఈ ఆఫర్‌లో మొత్తం మూడు రకాలు ఉన్నాయి.గోల్డ్‌ ప్లాన్‌లో 3 ఏళ్ల వారెంటీ లేదా 60వేల కిలోమీటర్ల వరకు,ప్లాటినం ప్లాన్‌లో 4 ఏళ్ల వారెంటీ లేదా 80వేల కిలోమీటర్లు,రాయల్‌ ప్లాటినం ప్లాన్‌లో 5 ఏళ్ల వారెంటీ లేదా లక్ష కిలోమీటర్ల వరకు వర్తిస్తుంది.మారుతీ సుజుకీ డీలర్స్‌ వద్ద కొనుగోలు చేసిన కార్లకు ఈ మూడు ప్లాన్లు ందుబాటులో ఉంటాయి.ఇక నెక్సాలో కొనుగోలు చేసిన కార్లకు ప్లాటినం,రాయల్‌ ప్లాటినం ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.