మారుతి విక్రయాలు మందగమనం

MARUTI
MARUTI

మారుతి విక్రయాలు మందగమనం

న్యూఢిల్లీ, నవంబరు 1: చిన్నకార్ల తయారీ దిగ్గజం మారుతిసుజుకి ఇండియా విక్రయాల్లో స్వల్పంగా తగ్గుదల నమోదయింది. అక్టోబరులో 1,33,793 వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 1,34,209యూనిట్లు విక్రయించింది. దేశీయంగావిక్రయాలు 1,21,063యూనిట్ల నుంచి 1,23,764 యూనిట్లకు పెరిగాయి. 2.2శాతం పెరిగాయి. మారుతిసుజుకి ఉత్పత్తులకు మార్కెట్‌ డిమాండ్‌ పెరుగు తున్నదని, సియాజ్‌, ఎస్‌క్రాస్‌, ఎర్టిగా, కొత్తగా వచ్చిన బ్రెజ్జా, బాలినో వంటి వాటి మార్కెట్‌ డిమాండ్‌ అనూహ్యంగా ఉన్నట్లు డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ కల్సి వివరించారు. పనిదినాలు, వాహనాల అందుబాటు, కార్మికుల లభ్యత, స్టాక్‌ ప్రణాళికలు వంటివి కొంత డిమాండ్‌కు అనుగుణంగా సతమతం అయ్యాయని ఆగస్టు నుంచి అక్టోబరు వరకూ మాత్రమే ఈ ప్రభావం ఉందని కంపెనీ వివరించింది. మొత్తంగాచూస్తే గత ఏడాదితో పోలిస్తే 14శాతం పెరిగా యని కల్సి వివరించారు. మినిసెగ్మెంట్‌కార్లు ఆల్టో, వ్యాగ న్‌ ఆర్‌ వంటివి 9.8శాతం పెరిగి 33,929 యూనిట్లకు చేరాయి. 37,595 యూనిట్లు గత ఏడాది విక్రయించింది. కంపెనీ కంపాక్ట్‌ విభాగంలో స్విఫ్ట్‌, ఎస్టిల్లో, రిట్జ్‌ డిజైర్‌ బాలెనో వంటివి 1.8శాతం క్షీణించి 51,048 యూనిట్లనుంచి 50,116 యూనిట్లకు చేరా యి. డిజై ర్‌టూర్‌ కంపాక్ట్‌ సెడాన్‌ 27.4శాతం క్షీణించింది. 2481 యూనిట్లు విక్రయించింది. మిడ్‌ సైజ్‌ సెడాన్‌ సియాజ్‌ ఎనిమిదిశాతం పెరిగి 6360 యూనిట్లకు చేరింది. జిప్సీ, గ్రాండ్‌ విటారా, ఎర్టిగా, ఎస్‌క్రాస్‌ కంపాక్ట్‌ ఎస్‌యువి విటారా బ్రెజ్జా 90.9శాతం పెరిగి 18,008యూనిట్లకు చేరాయి. ఇక వ్యాన్లు ఒమ్ని, ఈకో వాహనాలు 6.5శాతం క్షీణించి 12,790 యూనిట్లు విక్రయించింది. ఎగుమ తులపరంగాచూస్తే 23.7శాతం తగ్గాయి. 13,146 యూనిట్ల నుంచి 10,029 యూనిట్లకు పడిపోయాయి.