మారుతి బాలెనోకు వరల్డ్‌ కార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు

maruti17
maruti

మారుతి బాలెనోకు వరల్డ్‌ కార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు

న్యూఢిల్లీ, అక్టోబరు 16: మారుతిసుజుకి బాలెనో, ఫోర్డ్‌ఫిగో, సుజుకిఇగ్నిస్‌ వంటి కార్లను 2017 వరల్డ్‌ కార్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డులకు ఎంపిక అయ్యాయి. ప్రపంచ పట్టణప్రాంత కార్ల కేటగిరీలో ఈమూడు కూడా ఒకదానికొకటి పోటీపడతాయని అంచనా. ఈపోటీలో బిఎండబ్ల్యు ఐ3, సిట్రోన్‌ సి3, ఇ-మెహారి స్మార్ట్‌ బ్రాబస్‌రేంజ్‌ కార్లు కూడా పోటీపడినా బాలెనో, ఫోర్డ్‌ఫిగో, ఇగ్నిస్‌లకే దక్కింది. ఈ మూడు కార్లు ఇప్పటికే భారత్‌లో అమ్మకాలు జోరందుకున్నాయి. ఇగ్నిస్‌ను 2017 ప్రారం భంలో భారత్‌ మార్కెట్‌కు తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఫోర్డ్‌ ఫిగో కాప్లస్‌, మారుతి సుజుకిలను యూరోప్‌, బ్రెజిల్‌, భారత్‌ల కోసం రూపొందించారు ఇకసుజుకి ఇగ్నిస్‌ జపాన్‌లోనే ఉత్పత్తి చేస్తున్నారు. ఈ మూడు కార్లను తాజాగా మరికొన్ని దేశాలకు ఎగుమతి చేయా లని నిర్ణయించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటోమొటివ్‌ జర్నలిస్టులు ఏర్పాటు చేసిన వరల్డ్‌కార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అత్యంత ప్రాశస్త్యం కలుగుతుంది. గ్లోబల్‌స్థాయి సుజుకి బాలెనో 1.0 లీటర్‌ బూస్టర్‌ జెట్‌ టర్బో పెట్రోల్‌ మోటార్‌, 1.2లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో రూపొందించారు. సుజుకిఇగ్నిస్‌ అదేతరహా ఇంజన్లతో రూపొందించారు. భారత్‌లో కార్ల ఇంజన్‌ సామర్ధ్యం ఆధారంగా వీటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.