మారుతి నికరలాభాల్లో జోష్‌!

maruti
maruti

మారుతి నికరలాభాల్లో జోష్‌!

న్యూఢిల్లీ: భారత్‌లోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతిసుజుకి మంగళవారం 1709 కోట్ల రూపాయలు నాలుగోత్రైమాసిక నికరలాభంగా ప్రకటించింది. రాబడులు కూడా 20,423 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు అంచనావేసింది. మారుతిసుజుకి నికరలాభం 15.77శాతం గత ఏడాదితో పోలిస్తే పెరిగింది. గత ఏడాది ఇదేకాలంలో 1476.20 కోట్లు ఆర్జించింది. మార్కెట్‌నిపుణుల అంచనాల ప్రకారం చూస్తే కంపెనీ నికరలాభం 1769కోట్లు ఉంటుందని, అమ్మకాలు 18,439 కోట్లవరకూ ఉంటా యని వేసారు. అయితే అంచనాలను మించి లాభం, రాబడులు మారుతిసుజుకి సాధించింది. మారుతి సుజుకి నాలుగోత్రైమాసికంలో విక్రయాలు కూడా పెరిగాయి. 20శాతం పెరిగి 16,958.4 కోట్లకు చేరి నట్లు అంచనా. ఈ త్రైమాసికంలోనే మారుతిసుజుకి 4,14,439 వాహనాలను విక్రయించింది. 15శాతం వృద్ధితో ఉంది. మొత్తం విక్రయాలపరంగాచూస్తే 31,771 వాహనాలను ఎగుమతి చేసినట్లు మారుతి సుజుకి ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను మారుతిసుజుకి నికరలాభం మొత్తంగా 36.78శాతం పెరిగింది. 7337.70 కోట్లకు చేరింది. 5364.30 కోట్ల వరకూ ఉంది.

ఈ ఆర్థికసంవత్సరంలో మారుతి సుజుకి 15 లక్షల వాహనాలను విక్రయిస్తే వాటిలో 1,24,062 వాహనాలను ఎగుమతి చేసింది. అలాగే మారుతిసుజుకి కూడా 75శాతం వాటాకు డివిడెండ్‌ ప్రకటించింది. ప్రతి ఐదురూపాయల ముఖవిలువ ఉన్న షేరుకు డివిడెండ్‌ చెల్లిస్తోంది. గత ఏడాది కూడా ప్రతి వాటాకు 35 రూపాయలు డివిడెండ్‌ చెల్లించింది. వృద్ధిపరంగాచూస్తే దేశంలోని ఎక్కువ మోడళ్లను ఉత్పత్తిచేస్తున్న సంస్థగా మారుతి గుర్తింపును ఆసధించింది. టాప్‌ టెన్‌ మోడళ్లలో ఏడు మోడళ్లు మారుతిసుజుకికే దక్కాయి. అలాగే ఖర్చుతగ్గింపునకు చేపట్టిన కార్యాచరణ మంచి ఫలితాలిచ్చి లాభాలను పెంచింది. అదేసమయంలో కమోడిటీధరలు పెరుగుదల, విదేశీ కరెన్సీ కదలికల్లో ప్రతికూలత పాక్షికంగా విక్రయాలపై వార్షికపద్ధతిన ప్రభావం చూపించిందని మారుతిసుజుకి వెల్లడించింది. మారుతిసుజుకి షేర్లు నిలకడగా కొనసాగాయి. 6421.65 రూపాయలుగా ఉన్నాయి.