మారుతి అమ్మకాల్లో జోష్‌

MARUTI
MARUTI

మారుతి అమ్మకాల్లో జోష్‌

న్యూఢిల్లీ, జూన్‌ 2: దేశంలో చిన్న కార్ల తయారీ దిగ్గజం మారుతిసుజుకి 15శాతం అమ్మకాల్లో వృద్ధిని నమోదుచేసింది. దేశీయంగా ప్యాసింజర్‌ కార్లు యుటిలిటీ వాహణాలు, వ్యాన్‌లపరంగా భారీ వృద్ధిని నమోదుచేసింది. కంపనీ మొత్తంగా 1,30,248వాహనాలను విక్రయించింది. దేశీయ మార్కెట్‌లో గత ఏడాది 1,13,162 వాహ నాలను అమ్మింది. మారుతిలోని అనేక విభాగాల వాహనాలు పటిష్ట మైనవృద్ధిని నమో దు చేశాయి. యుటి లిటివాహనాల విభా గం 66శాతం పెరిగి 22,608 వాహనా లు ఉంటే మిగిలిన విభాగంఆల్టో, వ్యాగన్‌ఆర్‌ విభాగాల్లో 18 శాతం పెరిగి 39,089 వరకూ పెరిగాయి. కంపాక్ట్‌ విభాగంలో బాలెనో, ఇగ్నిస్‌, డిజైర్‌ వంటివి పదిశాతం వృద్ధిని నమోదుచేశాయి. 51,234 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ స్టాక్‌కొత్త గరిష్ట స్థాయిని నమోదుచేసి బిఎస్‌ఇలోప్రారంభం లోనే 7249గా ట్రేడింగ్‌ జరిపింది. ఎగుమతులపరం గా మారుతి 36శాతం క్షీణించి 6286కు చేరింది. మొత్తం అమ్మకాలపరంగా దేశీయంగాను, ఎగుమ తులపరంగా 11.3శాతంపెరిగి 1,36,962 యూని ట్లుగా మేనెలలో రికార్డుచేసింది. రెండంకెల వృద్ధిని రాబట్టినట్లు మారుతిప్రకటించింది. మొత్తంగా ప్రస్తు తం ఆటోమొబైల్‌రంగంలో47శాతంవృద్ధితో ఉంది.