మారుతిసుజుకి లాభం రూ.1744.5 కోట్లు

MARUTI
MARUTI

మారుతి సుజుకి లాభం రూ.1744.5 కోట్లు

 

న్యూఢిల్లీ, జనవరి 25: మారుతిసుజుకి ఇండియా మూడో త్రైమాసిక నికరలాభాలు 47శాతం పెరిగాయి. డిసెంబరు త్రైమాసికంలో భారీ వృద్ధిని సాధించికంపెనీ 1744.5 కోట్లు నికరలాభంప్రకటించింది. గత ఏడాది డిసెంబరుత్రైమాసికం తో పోలిస్తే 47.46శాతం వృద్ధిని సాధించింది. మొత్తం రాబడులు కూడా 19,791కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదేకాలంలో 6957కోట్ల రాబడులు 1183 కోట్ల నికరలాభం ఆర్జించింది. మూడోత్రైమాసికంలో మారుతి సుజుకి మొత్తంగా 3,87,251 వాహనాలను విక్రయించి 3.5శాతం వృద్ధిని సాధించింది. వీటిలో 30,748 యూనిట్లు ఎగుమతులుచేసింది. మార్కెట్‌నిపుణుల అంచనాలప్రకారం నికరలాభం 1747 కోట్లు ఉంటుందని అంచనావేసినా స్వల్పంగా తగ్గింది. ఎక్కువ విలాసవంతమైన మోడల్స్‌ వాటా పెరి గింది. తక్కువ విక్రయాలు, మార్కెట్‌ ఖర్చులు, నిర్వహణ వ్యయం నియంత్రణ, నిర్వహణేతర ఆదాయ వనరులు తగ్గించుకోవడంతో నికరలాభం పెరిగిందని కంపెనీ ప్రకటించింది. ప్రత్యేకించి ఉత్పత్తుల ముడి వనరుల ధరలు పెరగడం, విదేశీ కరెన్సీ కదలికలు కొంత ప్రతికూలంగా ఉందని మారుతిసుజుకి ప్రకటిం చింది. మారుతిసుజుకి షేర్లు 1.17శాతం పెరిగి రూ.5806గా ఉంది. నిఫ్టీలో 0.84శాతం పెరిగాయి.