మళ్లీ ఏవియేషన్‌, చమురు షేర్ల జోరు

air
air

మళ్లీ ఏవియేషన్‌, చమురు షేర్ల జోరు

ముంబై,2: ఈ మధ్యకాలంలో ఇంధన ధరలుపైపైకి పోతున్న కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏవియేషన్‌ రంగానికి కొంత ఉపశమనం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం వైమానిక ఆయిల్‌ ధరలపై సుంకాన్ని 3 శాతం తగ్గించడంతో ఇన్వెస్టర్లకు ఉత్సాహన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రభుత్వం వైమానిక ఇంధన ధరలపై 14శాతం ఉన్న సుంకాన్ని 3శాతం తగ్గించి దాన్ని 11శాతానికి తెచ్చింది. దీంతో వరుసగా మూడోరోజు కూడా ఏవియేషన్‌ రంగ కౌంటర్లకు డిమాండ్‌ పుట్టిం ది. గురువారం భారీగా పతనమైన మార్కెట్లో కూడా జోష్‌లో ఉన్న ఈ కౌంటర్‌ మరోసారి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో మూడు లిస్టెడ్‌ కంపెనీల షేర్లూ లాభాల దౌడు తీస్తున్నాఇయ. ప్రస్తుతం బిఎస్‌ఇలో స్పైస్‌జెట్‌ షేరు 5శాతం పెరిగి రూ.74వద్దట్రేడవుతోంది. గత రెండు రోజుల్లోనూ ఈ షేరు దాదాపు 10 శాతం పెరిగింది. ఈ దానిలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో జెట్‌ఎయిర్‌వేస్‌ షేరు కూడా 4 శాతం పెరిగి రూ.199వద్ద ట్రేడవుతోంది. గత రెండురోజుల్లో ఈ షేరు 10 శాతం పురోగమించింది. ఇక ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేర్లు కూడా ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 5 శాతం పుంజుకుంది. అదేవిధంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు కూడా గురువారం మార్కెట్లు పతనబాటలో సాగినప్పటికీ లాభాలతో దూసుకెళ్లిన చమురు రంగ షేర్లు శుక్రవారం కూడా అదేజోరులో సాగుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో దాదాపు ఇంధన రంగ షేర్లన్నీ కూడా లాభాల దౌడు తీస్తున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో హెచ్‌పిసిఎల్‌ షేరు దాదాపు 6 శాతం పెరిగి రూ.220 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.222 వరకూ చేరింది. గురవారం ఈ షేరు 14 శాతం పెరిగి రూ.208వద్ద ముగియగా, బిపిసిఎల్‌ కూడా 6 శాతం పెరిగి రూ.294కు చేరింది. ఐఒసి 3.4శాతం పెరిగి రూ.135వద్ద ట్రేడవుతోంది. ఇది గురువారం కూడా 4 శాతం పెరిగింది. ఒఎన్‌జిసి, గెయిల్‌ ఇండియా కూడా ఒక శాతం చొప్పున పెరిగాయి. గురువారం కూడా 10శాతం పెరిగాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు ధరలు నీరసించడం, రూపాయి బలపడటం కూడా ఈ చమురు రంగ కౌంటర్లకు ఉత్సాహాన్నిస్తున్నాయి.